Galaxy Unpacked Event శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ విడుదల తేదీ వచ్చేసింది... స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు
Samsung Galaxy S26 Series : శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ విడుదల తేదీ ఎట్టకేలకు అధికారికంగా వెల్లడయింది. ఈ సిరీస్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2026 లో విడుదల కానుంది. దీంతోపాటు గెలాక్సీ బడ్స్ 4, గెలాక్సీ బడ్స్ 4 ప్రో ఇయర్‌బడ్స్ కూడా విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది :
గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2026 (Galaxy Unpacked Event 2026) శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫిబ్రవరి 25 వ తేదీన 10:00 AM PT (11:30 PM IST) గంటలకు ప్రారంభం కానుంది. భారత్‌లో శాంసంగ్ వెబ్‌సైట్ (Samsung.com), శాంసంగ్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.

ముందస్తు రిజర్వేషన్ :
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ సహా గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ ను ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న యూజర్లు రూ.2699 విలువైన వోచర్లతోపాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని చెబుతోంది.
అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
త్వరలో విడుదల కానున్న గెలాక్సీ S26 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు గురించి అనేక లీక్స్ వచ్చాయి. డిస్‌ప్లే సైజ్ పరంగా గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల (2340 x 1080 పిక్సల్స్) డైనమిక్ అమోలెడ్ 2x డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అదే గెలాక్సీ S26 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల QHD+ డిస్‌ప్లే, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్ 6.9 అంగుళాల QHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూడు వేరియంట్స్ డిస్‌ప్లేలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుందని తెలుస్తోంది.
చిప్‌సెట్ :
గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్ వేరియంట్లు Exynos 2600 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 పైన పనిచేస్తుందని భావిస్తున్నారు.
200MP కెమెరా :
శాంసంగ్ గెలాక్సీ S26, S26 ప్లస్ మోడల్స్ 50MP OIS ప్రైమరీ, 12MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్ సపోర్టుతో 10MP టెలిఫోటో లెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అదే అల్ట్రా వేరియంట్ 200MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. 8K వీడియో రికార్డింగ్‌తోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉంటాయి.
బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా బేస్ వేరియంట్ 4300mAh బ్యాటరీ, గెలాక్సీ S26 ప్లస్ వేరియంట్ 4900mAh బ్యాటరీ, అల్ట్రా మోడల్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
దీంతోపాటు గెలాక్సీ బడ్స్ 4 సిరీస్ కూడా విడుదల కానుంది. ఈ బడ్స్ హెడ్ గెశ్చర్స్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ రెండు బడ్స్ మోడల్స్ అల్ట్రా వైడ్‌బ్యాండ్ చిప్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








