Home
Mobile

200MP కెమెరా సహా సూపర్‌ కెమెరాలతో శాంసంగ్ ఫోన్‌.. కీలక వివరాలు లీక్‌!

శాంసంగ్‌ నుంచి ఈ సంవత్సరం గెలాక్సీ S25 సిరీస్‌ విడుదల అయింది. ఇటీవల స్లిమ్ మోడల్‌ ఎడ్జ్ కూడా లాంచ్‌ అయింది. అయితే శాంసంగ్‌ నుంచి గెలాక్సీ S26 సిరీస్‌ కూడా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై శాంసంగ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సిరీస్‌ లో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

గెలాక్సీ S26 సిరీస్‌ (Samsung Galaxy S26 Series) గురించి తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి. టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ X హ్యాండిల్‌ లో ఈ వివరాలను వెల్లడించారు. శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా వివరాలను షేర్‌ చేశారు. ముఖ్యంగా అల్ట్రా వేరియంట్ వివరాలను హైలెట్‌ చేశారు.

samsung galaxy S26 series

క్వాడ్‌ కెమెరా సిస్టమ్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్‌ క్వాడ్‌ కెమెరా సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. ఇందులో 200MP ప్రైమరీ కెమెరా (200MP Camera Samsung Smartphone), 50MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్‌, 5x ఆప్టికల్‌ జూమ్‌ తో 50MP పెరిస్కోప్‌ లెన్స్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేశారు.

ట్రిపుల్‌ కెమెరా సిస్టమ్ :
అయితే గెలాక్సీ S26, గెలాక్సీ S26+ మోడల్స్‌ కెమెరా వివరాలను షేర్‌ చేశారు. ఈ రెండు మోడల్స్‌ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్ మరియు 3x ఆప్టికల్‌ జూమ్‌ తో 12MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అయితే శాంసంగ్ గెలాక్సీ S26, గెలాక్సీ S26+ స్మార్ట్‌ఫోన్‌ లు శాంసంగ్‌ ISOCELL S5KGNG ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు సోనీ IMX564 అల్ట్రావైడ్‌ లెన్స్‌, శాంసంగ్‌ ISOCELL S5K3LD టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

గత మోడల్స్‌ కంటే కెమెరా విభాగం పరంగా గెలాక్సీ S26 సిరీస్‌ లో అప్‌గ్రేడ్స్‌ ను గుర్తించవచ్చని తెలుస్తోంది. ఫలితంగా మెరుగైన ఫోటోగ్రఫీ అనుభూతిని పొందవచ్చని తెలుస్తోంది. అయితే ఈ లీక్స్‌ పై శాంసంగ్‌ ఎటువంటి స్పందన తెలియజేయలేదు.

శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ 2026 సంవత్సరం జనవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అదే సంవత్సరం ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. కొన్ని రిపోర్టుల ఆధారంగా ఫిబ్రవరి 2026 లో జరగనున్న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ లో ఈ సిరీస్‌ ను లాంచ్‌ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే గెలాక్సీ S26 సిరీస్‌ విడుదల సహా స్పెసిఫికేషన్‌ ల వివరాలపై శాంసంగ్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. భారత్‌లో విడుదలపై త్వరలోనే అనేక వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల శాంసంగ్‌ ఫ్లాగ్‌షిప్‌ ధర సెగ్మెంట్‌లో గెలాక్సీ S25 ఎడ్జ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung galaxy S26 series camera specifications tipped, expected to launch in february 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X