Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ లాంచ్‌ తేదీ, స్పెసిఫికేషన్‌లు లీక్‌.. పూర్తి వివరాలు..!

Samsung Galaxy S26 Series : శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ త్వరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ A26, గెలాక్సీ S26 ప్లస్‌, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్ అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సిరీస్‌ లాంచ్‌ పై కీలక వివరాలు వెల్లడయ్యాయి. టిప్‌స్టర్‌ ఐస్‌ యూనివర్స్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సిరీస్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది? :
టిప్‌స్టర్‌ ఐస్‌ యూనివర్స్‌ లీక్‌ చేసిన వివరాల ఆధారంగా శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో ఫిబ్రవరి 25 వ తేదీన లాంచ్‌ కానున్నాయని తెలిపారు. గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ విడుదలవుతుందని తెలిపారు.

Samsung Galaxy S26 Series

గెలాక్సీ సిరీస్‌ ముందస్తు బుకింగ్‌లు ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమవుతాయని, మార్చి 4 వ తేదీ వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సిరీస్‌ తొలి సేల్‌ మార్చి 11 నుంచి ప్రారంభం కానుందని టిప్‌స్టర్‌ ఐస్‌ యూనివర్స్‌ తెలిపారు. ఈ వివరాలపై శాంసంగ్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్‌ :
టిప్‌స్టర్‌ లీక్స్‌ ఆధారంగా శాంసంగ్‌ గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 లేదా Exynos 2600 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. మార్కె్ట్లను బట్టి చిప్‌సెట్‌లో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలిపారు.

భారత్ మార్కెట్‌లో Exynos OS అదే చైనా, అమెరికా మార్కెట్స్‌లో స్నాప్‌డ్రాగన్‌ OS తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత One UI 8.5 పైన పనిచేస్తుందని చెబుతున్నారు. 12GB ర్యామ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

శాంసంగ్‌ గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్‌ 6.3 అంగుళాల ఫ్లాట్‌ LTPO M14 అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెబుతున్నారు. 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, HDR10+ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుందని అంచనా వేశారు.

శాంసంగ్‌ గెలాక్సీ S26 ప్లస్‌ :
శాంసంగ్‌ గెలాక్సీ S26 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. HDR10+ సపోర్టుతో పాటు IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు ఫోన్‌లు అల్యూమినియం ఫ్రేమ్, రెండు వైపులా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంటుందని తెలుస్తోంది.

బ్యాటరీ పరంగా గెలాక్సీ S26 మోడల్‌ 25W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4300mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే గెలాక్సీ S26 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4900mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం.

కెమెరా విభాగం పరంగా రెండు ఫోన్‌లు 50MP ప్రైమరీ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), 12MP అల్ట్రావైడ్‌ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌, OIS తో 12MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే అల్ట్రా వేరియంట్‌ ఫోన్‌ 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్‌, 5x జూమ్‌తో 50MP, 3x జూమ్‌తో 12MP కెమెరాలతోపాటు 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ :
శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అయితే చైనా, అమెరికా మార్కెట్‌లలో ఈ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. భారత్ మార్కెట్‌లో Exynos 2600 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.

ఈ అల్ట్రా వేరియంట్‌ 6.9 అంగుళాల LTPO M14 QHD+ అమోలెడ్‌ తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, HDR10+, 3000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా విక్టస్‌ 3, IP68 రేటింగ్‌తో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S26 Series launch date, sale date tipped in india expected specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X