Home
Mobile

200MP కెమెరా, 7 సంవత్సరాల అప్‌డేట్స్‌, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా విడుదల

Samsung Galaxy S26 Ultra Smartphone : గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ 2026 ఈవెంట్‌లో (Galaxy Unpacked 2026) భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్‌ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్‌, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే అల్ట్రా వేరియంట్‌ 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్ 5 చిప్‌సెట్‌, 6.9 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ముందస్తు బుకింగ్‌పై అనేక ప్రయోజనాలను అందిస్తామని తెలిపింది.

శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఫోన్‌ 6.9 అంగుళాల డైనమిక్ అమోలెడ్‌ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 10 బిట్‌ కలర్‌ అవుట్‌పుట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ డిస్‌ప్లే ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే 30 డిగ్రీలకు వ్యూయింగ్ యాంగిల్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా ఆర్మర్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Samsung Galaxy S26 Ultra launched

7 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ అల్ట్రా వేరియంట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 16GB ర్యా్మ్, 1TB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 పైన పనిచేస్తుంది. 7 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

ఈ ఫోన్‌ అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది. కాలింగ్‌ సమయంలో Live Transcripts ఫీచర్‌ ఉపయోగపడుతుంది. అంటే అవతలి వ్యక్తులు ఏ భాషలో మాట్లాడిన, మీకు కావాల్సిన అనువాదం చేస్తుంది. దీంతోపాటు ఇమేజింగ్‌ టూల్స్‌, ఏఐ నాయిస్‌ రిడక్షన్‌ సపోర్టు కూడా ఉంది.

Samsung Galaxy S26 Ultra launched

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు క్వాడ్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.4 అపేచర్‌, ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుత 200MP కెమెరా, 5x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, రివర్స్‌ ఛార్జింగ్‌ :
ఈ కెమెరాలు 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 12MP కెమెరాను కలిగి ఉంది. ఈ సెల్ఫీ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 60W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌, 4.5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టు కూడా ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, బ్లూటూత్ 6, వైఫై 7, NFC, GPS, GLONASS, QZSS, BDS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు ఇ-కంపాస్‌, గైరోస్కోప్‌, యాక్సెలిరోమీటర్‌, బారోమీటర్‌ ప్రాక్సిమిటీ సెన్సర్‌ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది. S పెన్‌ను సపోర్టు చేస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,39,999 గా ఉంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,59,999, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,89,999 గా ఉంది.

ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. 256GB స్టోరేజీ ఆర్డర్‌ చేసి వారికి 512GB స్టోరేజీ వేరియంట్‌ను అందిస్తామని చెబుతోంది. దీంతోపాటు రూ.2699 విలువైన వోచర్‌ను కూడా అందిస్తామని చెబుతోంది. ప్రీ రిజర్వేషన్‌ చేసుకున్న వారికి మార్చి 6 నుంచి డెలివరీలు అందిస్తామని తెలిపింది.

భారత్‌ మార్కెట్‌లో అల్ట్రా మోడల్‌ సేల్‌ మార్చి 11 నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఈ ఫోన్‌ బ్లాక్‌, బ్లూ, పర్పుల్‌, వైట్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అయితే శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో మరిన్ని ప్రత్యేక కలర్‌ వేరియంట్స్‌లోనూ అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy S26 Ultra launched with 200MP Camera, snapdragon 8 elite Gen 5 Chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X