Home
Mobile

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఇప్పుడు రూ.19,499కే!

2012కు గాను ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 అమ్మకాల పరంగా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో ఇటీవల ధర తగ్గింపును అందుకున్న గెలాక్సీ ఎస్3 ప్రస్తుత మార్కెట్లో రూ.25,400కు విక్రయించబడుతోంది. తాజాగా, ఈ ఫోన్ కొనుగోలు పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ భారీ ఎక్స్చేంజ్ ఆఫర్‌కు తెరలేపింది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్3ని కేవలం 19,499కే ఆఫర్ చేస్తుంది. గెలాక్సీ ఎస్3ని ఈ ధర పై సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేయవల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఇప్పుడు రూ.19,499కే!

గెలాక్సీ ఎస్3 కీలక స్పెసిఫికేషన్‌లు:

హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్, 8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, కంఫర్టబుల్ గ్రిప్, తేలికైన బరువు, నాజూకు శ్రేణి డిజైనింగ్, ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ. సాధారణ ఆఫర్ లో గెలాక్సీ ఎస్3 మార్కెట్ ధర రూ.24900. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని 5 అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం జెల్లీబీన్ 4.3 పై స్పందిస్తుంది. వాచ్ ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..... 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 800 మెగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25 గంటల బ్యాటరీ బ్యాకప్. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరింయట్‌లలో లభ్యం కానుంది. 1.9 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, 10 సెకండ్ 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 315ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీ వ్యవస్థ. మీ వాయిస్ ఆధారంగా వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రత్యేకమైన నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ, లౌడ్ స్పీకర్. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ క్రమంలో 70 అప్లికేషన్ తయారీ సంస్థలతో సామ్‌సంగ్ ఒప్పందం కుదుర్చుకుంది. పాపులర్ అప్లికేషన్‌లైన ఎవర్ నోట్, పాత్, రన్ కీపర్, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్‌లను గెలాక్సీ గేర్ వాచ్ సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లోని 5 అత్యుత్తమ ఫీచర్లు

1.) వాయిస్ కాల్స్, ఎస్ వాయిస్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్‌కు ఉపకరిస్తుంది. వాచ్‌లోని మరో ఫీచర్ ఎస్ వాయిస్‌తో వాతావరణం, ఆలారమ్ ఇంకా డ్రాఫ్ట్ మెసేజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

2.) 1.9 మెగా పిక్సల్ కెమెరా, మెమోగ్రాఫర్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన 1.9 మెగా పిక్సల్ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

3.) భిన్నమైన కలర్ వేరియంట్‌లు, గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ 6 భిన్నమైన కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

4.) మ్యూజిక్ కంట్రోల్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లే చేసిన మ్యూజిక్‌ను గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.

5.) పిడో మీటర్: గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసిన పిడీమీటర్ ఫీచర్ మీ వ్యాయామ తీరుకు సంబంధించిన వివరాలను తెలుపుతుంది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X