ఫేస్‌బుక్‌లో ఆ హాట్ టాపిక్!

భారీ అంచనాల మధ్య మే 3న, మార్కెట్లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 అదే రీతిలో మార్కెట్‌ను ఆకట్లుకోగలిగింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రెండు నెలల వ్యవధిలోనే కోటి యూనిట్లను అధిగిమించడం ఆశ్చర్యకర పరిణామం.
ఇప్పటి వరకు పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 త్వరలో బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభ్యంకానుంది. ఈ విషయాన్ని స్వయంగా సామ్‌సంగ్ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీ పై పోస్ట్ చేసింది. మొత్తం మూడు ఫోటోలను సామ్‌సంగ్ తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ప్రదర్శించింది. సామ్‌సంగ్ తీసుకున్న తాజా నిర్ణయం త్వరలో విడుదల కాబోతున్న ఆపిల్ ఐఫోన్ 5 అమ్మకాల పై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్ లు:
4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.
ధర వివరాలు:
పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.


Click it and Unblock the Notifications








