ఫోటో లీక్.. మొదలైన గుస గుస!!

మార్కెట్ వర్గాలను ఓవైపు.. అభిమానులను మరో వైపు గత కొంత కాలంగా ఉత్కంఠకు లోను చేస్తున్న శామ్‌సంగ్ గెలక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ ఒకటి బహిర్గతమైంది. మే 22 న యూకేలో నిర్వహంచే ఒ ప్రత్యేక కార్యక్రమం కోసం శామ్‌సంగ్ డిజైన్ చేసిన ఆహ్వాన పత్రం పై ఈ ఫోటోను కనుగొన్నారు. ఈ కార్యక్రమంలోనే గెలక్సీ ఎస్3ని లాంఛ్ చేయునున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఫోటోను తొలిగా ఓ కొరియన్ న్యూస్ సైట్ బట్టబయలు చేసింది.
గెలక్సీ ఎస్ 3 ఫీచర్లు:
. గొరిల్లా గ్లాస్ డిస్ ప్లే,
. స్లిమ్ అదే విధంగా స్లీక్ తరహా డిజైనింగ్,
. హై డెఫినిషన్,
. క్వాడ్ కోర్ ప్రాసెసర్,
. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
. టచ్‌విజ్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
దూకుడు పెంచిన శామ్‌సంగ్:
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న శామ్‌సంగ్ దూకుడును మరింత పెంచింది. తన గెలక్సీ లైనప్‌కు మరిన్ని కొత్త ఉత్పత్తులను జోడించనుంది. రానున్న కొత్త వాటిలో టాబ్లెట్ పీసీలతో పాట స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. తాజాగా గెలక్సీ లైనప్ నుంచి మూడు కొత్త బ్రాండ్ పేర్లను శామ్‌సంగ్ వెల్లడించింది. పేర్లు గెలక్సీ ప్రీమియర్, గెలక్సీ గ్రాండ్, గెలక్సీ నెక్స్ట్. వీటిలో ఏది స్మార్ట్‌ఫోనో.. ఏది టాబ్లెట్ పీసీనో తెలియాల్సి ఉంది. గత నెలలో గెలక్సీ బీమ్ (ప్రొజెక్టర్ స్మార్ట్‌ఫోన్), గెలక్సీ నోట్ ( పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్ ) బ్రాండ్ నేమ్‌లతో స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టి గెలక్సీ లైనప్‌ను శామ్‌సంగ్ మరింత బలోపేతం చేసింది. తాజా పరిమాణంతో గెలక్సీ సిరీస్ పరిధి మరింత విస్తరించాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications