నువ్వా-నేనా..(అగ్ర హిరోల మధ్య ఆధిపత్య పోరు!)

By Prashanth
|
Samsung Galaxy S3 Mini with Android Jelly Bean Launched
సామ్‌సంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గెలాక్సీ ఎస్3 మినీ’ని గురువారం జర్మనీలో ఆవిష్కరించారు. ఆపిల్ ఐప్యాడ్ మీనీకి పోటీగా డిజైన్ కాబడిన ఈ 4 అంగుళాల సొగసరి స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ లుక్‌తో చూపరులను అలరిస్తోంది. క్రిస్టమస్ నాటికి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది. వివిధ మెమరీ వేరియంట్‌లలో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది. ధర అంచనా రూ.20,000 నుంచి రూ.25,000 మధ్య. మరో వైపు ఆపిల్ కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 5 ఇప్పటికే పలు దేశాల్లో అమ్మకాల పరంగా దూసుకుపోతుంది. ఎస్3 మినీ ఆవిష్కరణ నేపధ్యంలో ఐఫోన్5 అమ్మకాలు ఏ విధంగా ఉండొచ్చన్న చర్చ మార్కెట్ వర్గాల్లో మొదలైంది. ఐఫోన్ 5 ఇండియాన్ మార్కెట్లో దీపావళి కానుకగా అక్టోబర్ 26 నుంచి అధికారికంగా అందుబాటులోకి రానుంది. అయితే గ్రేమార్కెట్లో ఈ డివైజ్ ను రూ.75,000 నుంచి రూ.1,10,000 మధ్య విక్రయిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో ఆపిల్ ఐఫోన్5, గెలాక్సీ ఎస్3 మినీల స్పెసిఫికేషన్‌ల పై తులతాత్మక అంచనా......

 

శరీర పరిమాణం ఇంకా బరువు:

 

గెలాక్సీ ఎస్3 మినీ: 121.55 x 63 x 9.85మిల్లీమీటర్లు, బరువు 111.5 గ్రాములు,

ఐఫోన్ 5: 123.8 x 58.6 x 7.6మిల్లీమీటర్లు, బరువు 112 గ్రాములు,

డిస్ ప్లే:

గెలాక్సీ ఎస్3 మినీ: 4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 400పిక్సల్స్), 233 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

ఐఫోన్ 5: 4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్),

ప్రాసెసర్:

గెలాక్సీ ఎస్3 మినీ: 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్(మధ్య ముగింపు),

ఐఫోన్ 5: ఆపిల్ ఏ6 చిప్ సెట్ (ఆధునిక వర్షన్),

ఆపరేటింగ్ సిస్టం:

గెలాక్సీ ఎస్3 మినీ: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, రీసైజబుల్ విడ్జెట్స్, వాల్ పేపర్ ప్రీవ్యూ, హై రిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్, ఆండ్రాయిడ్ బీమ్, వై-ఫై నెట్ వర్క్).

ఐఫోన్ 5: ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, (ప్రత్యేకతలు: ఆపిల్ మ్యాప్స్, మెరుగైన సిరీ వాయిస్ అప్లికేషన్, సరికొత్త సఫారీ బ్రౌజర్, ఐక్లౌడ్ స్టోరేజ్, ఫేస్‌బుక్ అనుసంధానం, న్యూపాస్ బుక్ అప్లికేషన్, ఫోటోస్ట్రీమ్ అప్లికేషన్),

కెమెరా:

గెలాక్సీ ఎస్3 మినీ: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఐఫోన్ 5: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఐసైట్ టెక్నాలజీ), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

స్టోరేజ్:

గెలాక్సీ ఎస్3 మినీ: 8జీబి, 16జీబి మెమరీ వేరియంట్స్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత.

ఐఫోన్ 5: 16జీబి, 32జీబి, 64జీబి మెమరీ వేరియంట్స్, 1జీబి ర్యామ్.

కనెక్టువిటీ:

గెలాక్సీ ఎస్3 మినీ: హెచ్‌ఎస్‌డీపీఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ).

ఐఫోన్ 5: హెచ్‌ఎస్‌డీపీఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 4.0 విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్.

బ్యాటరీ:

గెలాక్సీ ఎస్3 మినీ: 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ(బ్యాకప్ వివరాలు తెలియల్సి ఉంది),

ఐఫోన్ 5: లియోన్ బ్యాటరీ (225 గంటల స్టాండ్‌బై, 8 గంటల టాక్‌టైమ్),

తీర్పు:

జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఇంకా ఇతర ట్రెండీ ఫీచర్లు గెలాక్సీ ఎస్3 మినీకి మరింత బలాన్ని చేకూరుస్తాయి. అలాగే.. ఐవోఎస్6 ఆపరేటింట్ సిస్టం, అత్యాధునిక ఆపిల్ ఏ6 చిప్ సెట్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వాయిస్ అసిస్టెంట్ సిరీ వంటి అంశాలు ఐఫోన్5 పటిష్టతను రెట్టింపు చేస్తాయి. గెలాక్సీ ఎస్3 మినీ, ఐఫోన్ 5కు పోటీనిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. అమ్మకాల పరంగా ఈ డివైజ్‌ల మధ్య తీవ్రమైన పోరు తప్పదు.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X