సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నియో ఇప్పుడు రూ.11,499కే
సామ్‌సంగ్ నుంచి విడుదలై కొద్ది నెలల క్రితమే ధర తగ్గింపును అందుకున్న గెలాక్సీ ఎస్3 నియో మరోసారి ధర తగ్గింపును అందుకుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.11,499. విడుదల సమయంలో గెలాక్సీ ఎస్3 నియో వాస్తవ ధర రూ.15,999. ఆ తరువాత 12,499కి తగ్గించారు. తాజా ధర తగ్గింపు భాగంలో ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ సహా కొన్ని రిటైల్ అవుట్‌లెట్‌లు ఈ ఫోనను రూ.11,499కే ఆఫర్ చేస్తున్నాయి.

గెలాక్సీ ఎస్ 3 నియో ఫీచర్లను పరిశీలించినట్లయితే...
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (హైడెఫినిషన్ రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ లేదా హెక్సా కోర్ ప్రాసెసర్ (1.7గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ కార్టెక్స్ ఏ15 + 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స ఏ7), 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్ ప్రత్యేకతలతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ అలానే సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 148.4 x 77.4 x 8.6 మిల్లీ మీటర్లు, బరువు 162.5 గ్రాములు.


Click it and Unblock the Notifications








