హాట్.. హాట్ ఆన్‌లైన్ డీల్స్!

Posted By: Prashanth

హాట్.. హాట్ ఆన్‌లైన్ డీల్స్!

 

ప్రస్తుత టెక్ మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న హాట్ టాపిక్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3’..గురువారం భారత్ మార్కెట్లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ గ్యాడ్జెట్ ప్రియుల్లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ గ్యాడ్జెట్ 16జీబి వర్షన్ ధరను రూ. 43,180గా సామ్‌సంగ్ ఇండియా ప్రకటించింది. మార్కెట్లో లభ్యమవుతున్న ‘హెచ్‌టీసీ వన్ ఎక్స్’, ‘సోనీ ఎక్స్‌పీరియా ఎస్’లతో పోలిస్తే గెలాక్సీ ఎస్3 ధర ఎక్కువ. గెలాక్సీ ఎస్ 3 ధర విషయంలో అభిమానులు నిరుత్సాహానికి గురువతున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. వీరి నిరుత్సాహాన్ని కొంత మేర తగ్గించేందుకు పలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ‘గెలాక్సీ ఎస్ 3’ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై రాయితీని ప్రకస్తున్నాయి.వాటి వివరాలు...

హోమ్ షాప్18

ఈ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ‘గెలాక్సీ ఎస్ 3’ని రూ.38,900 ధరకు విక్రయిస్తోంది. ఎమ్మార్పీ ధరకు 4,000 తక్కువ. ఈ ఫోన్ కొనుగోలు పై కాంప్లీమెంటరీ బహుమతితో పాటు బ్లూటూత్ మోనో హెడ్‌సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. దేశంలోని ఏ ప్రాంతానికైనా హోమ్ డెలివరీ చార్జీలు ఉండవు.

ఫ్లిప్ కార్ట్

ఈ ఆన్‌లైన్ రిటైలర్ ‘గెలాక్సీ ఎస్ 3’ని 30 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారంటీతో రూ.38900కు విక్రయిస్తోంది.

స్నాప్‌డీల్ :

దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్‌లలో ఒకటైన స్నాప్‌డీల్ ‘గెలాక్సీ ఎస్ 3’ని రూ.38,900 ధరకు విక్రయిస్తోంది. కొనుగోలు పై ఉచిత బహుమతులు లేవు. ఉచిత హోమో డెలివరీ సదుపాయం కలదు. వస్తువు పొందిన తరువాతనే డబ్బు చెల్లించే సదుపాయాన్ని కల్పించారు.

ఈ-బే

ఈ ఆన్‌లైన్ రిటైలర్ నెలసరి వాయిదాల పద్ధతిలో గెలాక్సీ ఎస్3ని విక్రియస్తోంది. నిర్ణీత ధర రూ.38,900. వాయిదాల పద్ధతిలో చెల్లించే వారికి రుసుము ఎక్కువుగా ఉంటుంది.

బుయ్ ద ప్రైస్:

ఈ సైట్ రూ.38,900ధరకు గెలాక్సీ ఎస్3ని ఆఫర్ చేస్తుంది. వినియోగదారుల కొనుగోలు పై రూ.2,419 విలువ చేసే స్కల్ క్యాండీ లో రైడర్ ఎస్‌సీ హెడ్‌ఫోన్‌తో పాటు రూ. వెయ్యి విలువ చేసే బుయ్ ద ప్రైస్ వోచర్‌ను పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot