ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన హాట్..హాట్!!

By Super
|
Samsung Galaxy S3 Reachens India


న్యూఢిల్లీ: సామ్ సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్ ల విభాగంలో మరో కొత్త మోడల్ అయిన ‘గెలాక్సీ ఎస్ 3’ గురువారం భారత్ లో విడుదలయ్యింది. రూ.43,180 ధర కలిగిన ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ లను శుక్రవారం నుంచి విక్రయించనున్నట్లు సామ్ సంగ్ ఇండియా మొబైల్ అండ్ ఐటీ విభాగాధిపతి రంజిత్ యాదవ్ తెలిపారు. స్మార్ట్ ఫోన్ ల అమ్మకాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న తాము ఈ ఏడాది మార్కెట్లో 60శాతం వాటాను చేజిక్కించుకోగలమన్న ధీమాను యాదవ్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే ఈ ఆధునిక స్మార్ట్‌ఫోన్ సరికొత్త ట్రెండ్‌ను సృష్టించగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

 

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 3, 2012న ఆవిష్కరించారు. బరవు 133 గ్రాములు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X