ఆల్ టైమ్ రికార్డులు ఖాయమా..?

By Prashanth
|
Samsung Galaxy S3


‘సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 3 ఇండియన్ మార్కెట్లో విడుదలకు సమయం దగ్గర పడుతుంది.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న ఈ సరికొత్త గ్యాడ్జెట్, స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కనివిని ఎరగని రికార్డులను నెలకొల్పనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో వీటి అమ్మకాలు పై విశ్లేషణలు జోరందుకున్నాయి.’

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ విడుదలవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2011లో విడుదలైన సామ్‌‌సంగ్ గెలాక్సీ ఎస్2, 2012 ఫిబ్రవరి నాటికి 20 మిలయన్ యూనిట్లు అమ్మకాలను క్రాస్ చేసింది. ఇండస్ట్రీలో ఈ విషక్యం నిన్న మొన్నటి వరకు సంచలనమే. ఈ సిరీస్ తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 3, నెల దాటక ముందే 9 మిలియన్ల యూనిట్లకు సంబంధించి ప్రీఆర్డర్లను దక్కించుకుంది!.

ఈ సమచారాన్ని స్వయానా సామ్‌సంగ్‌కు చెందిన ఓ అధికారి కొరియా ఎకనామిక్ డైలీకి వెల్లడించినట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్3 అమ్మకాల విషయంలో గెలాక్సీ ఎస్2ను మించిపోవటమే కాకుండా స్మార్డ్‌ఫోన్ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డులన నెలకొల్పనుందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గెలాక్సీ ఎస్3కి దక్కిన 9 మిలియన్ల ప్రీ ఆర్డర్లు 145 దేశాలకు చెందిన 290 మొబైల్ ఆపరేటర్ల నుంచి వచ్చినట్లు వినికిడి. అయితే, ఈ వివరాలను సామ్‌సంగ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.

అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో సుసంపన్నమైన ‘గెలాక్సీ ఎస్3’ మే 31 నుంచి ఇండియాలో లభ్యం కానుంది!. యూరోప్‌లో మే29నే ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 16జీబి, 32జీబి, 64జీబి మెమెరీ వేరింయట్‌లలో లభ్యం కానుంది. రూ.38,000 నుంచి రూ.42,500 ధరల మధ్య వీటిని విక్రియించనున్నారు. ప్రత్యేకించి ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ కోసం సామ్‌సంగ్ పలు ఉపకరణాలను లాంచ్ చేసింది. ఈ జాబితలో ఎస్ పెబ్బిల్ ఎంపీత్రీ ప్లేయర్, వైర్ లెస్ ఛార్జింగ్ కిట్, బ్యాటరీ స్టాండ్ తదితర అంశాలు ఉన్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X