పోటీ స్టార్ట్ ఎవరో విన్నర్..?

Posted By: Prashanth

పోటీ స్టార్ట్ ఎవరో విన్నర్..?

 

ఆపిల్ ఐఫోన్‌కు పోటీగా శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్-3ను యూరప్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 4.0 మీద పనిచేసే ఈ మొబైల్‌ను ఈ నెల 31న భారత్‌లో విడుదల చేయనుంది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 5కు ఈ ఫోన్ గట్టి పోటీనివ్వనున్నదని అంచనా.

9 మిలియన్ల ప్రీఆర్డర్లు?

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ విడుదలవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2011లో విడుదలైన సామ్‌‌సంగ్ గెలాక్సీ ఎస్2, 2012 ఫిబ్రవరి నాటికి 20 మిలయన్ యూనిట్లు అమ్మకాలను క్రాస్ చేసింది. ఇండస్ట్రీలో ఈ విషక్యం నిన్న మొన్నటి వరకు సంచలనమే. ఈ సిరీస్ తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 3, నెల దాటక ముందే 9 మిలియన్ల యూనిట్లకు సంబంధించి ప్రీఆర్డర్లను దక్కించుకుంది!. ఈ సమచారాన్ని స్వయానా సామ్‌సంగ్‌కు చెందిన ఓ అధికారి కొరియా ఎకనామిక్ డైలీకి వెల్లడించినట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్3 అమ్మకాల విషయంలో గెలాక్సీ ఎస్2ను మించిపోవటమే కాకుండా స్మార్డ్‌ఫోన్ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డులన నెలకొల్పనుందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గెలాక్సీ ఎస్3కి దక్కిన 9 మిలియన్ల ప్రీ ఆర్డర్లు 145 దేశాలకు చెందిన 290 మొబైల్ ఆపరేటర్ల నుంచి వచ్చినట్లు వినికిడి. అయితే, ఈ వివరాలను సామ్‌సంగ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఈ స్మార్ట్‌ఫోన్‌ను మే 3, 2012న ఆవిష్కరించారు. బరవు 133 గ్రాములు. ధర అంచనా రూ.40,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot