సామ్‌సంగ్ వరల్డ్ రికార్డ్: 3నెలల్లో 20కోట్లు!

Posted By: Super

సామ్‌సంగ్ వరల్డ్ రికార్డ్: 3నెలల్లో 20కోట్లు!

తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్3’ ప్రపంచవ్యాప్త అమ్మకాల సంఖ్యను సామ్‌సంగ్ బహిర్గతం చేసింది. మేలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ 3 నెలల వ్యవధిలోనే 20 మిలియన్ యూనిట్లను క్రాస్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

తాజాగా గణంకాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు ప్రపంచవ్యాప్త స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భాగంగా ఆపిల్‌ను సామ్‌సంగ్ అధిగమించినట్లేనని అభిప్రాయపడుతున్నారు. పేటెంట్ హక్కులకు సంబంధించి గత కొంత కాలంగా ఆపిల్, సామ్‌సంగ్‌ల మధ్య వైరం నడుస్తున్న విషయం తెలిసిందే.

యూఎస్ మార్కెట్లో పలు సామ్‌సంగ్ ఫోన్‌లను బ్యాన్ చేయాలంటూ ఆపిల్ దాఖలు చేసిన పిటీషన్‌లోకి తాజాగా గెలాక్సీ ఎస్3 చేరటంతో దిగ్జజాల మధ్య వైరం రసవత్తరంగా మారింది. ఈ వివాదం పై కోర్టు తీర్పుకు సంబంధించి భిన్నవాదనలు వినిపిస్తున్న నేపధ్యంలో యాఎస్ వినియోగదారులు గెలాక్సీ ఎస్3ని కొనుగోలు చేసేందుకు త్వరపడుతున్నారని ఈక్విటీ సెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ ట్రిప్ చౌదరి పేర్కొన్నారు.

గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు.

పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot