పూర్తి డిటేల్స్..!!

Posted By: Staff

పూర్తి డిటేల్స్..!!

 

సామ్‌సంగ్ తాజాగా విడుదల చేయుబోతున్న స్మార్ట్‌ఫోన్ గెలక్సీ ఎస్3 ‘మే3’న లాంచ్ కాబోతుంది. విడదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపుతున్న ఈ హ్యాండ్‌సెట్ మన్నికైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉంది. ‘వన్ ఇండియా’ పాఠకుల కోసం శామ్‌సంగ్ గెలక్సీ ఎస్ 3 ఫీచర్లు క్లుప్తంగా....

4.5 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆంగ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1400మెగాహెడ్జ్ సామ్‌సంగ్ Exynos 4412ప్రాసెసర్, ఫ్రంట్ కెమెరా 1.3 మెగా పిక్సల్, రేర్ కెమెరా 8 మెగా పిక్సల్, ఇంటర్నల్ స్టోరేజ్ 1జీబి, ఎక్సటర్నల్ స్టోరేజ్ 32జీబి, మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్, కనెక్టువిటీ (జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై,బ్లూటూత్, ఇన్‌ఫ్రా రెడ్ పోర్టు), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, లౌడ్ స్పీకర్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో అవుట్,

జూన్ నాటికి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా యువతకు కావల్సిన టెక్నికల్ అంశాలు ఈ ఫోన్‌లో సమృద్ధిగా నిండి ఉన్నాయి. పొందుపరిచిన ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్ యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌కు సహకరిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుందా లేదా అన్న అంశం పై సందిగ్థత నెలకుంది. ఈ స్మార్ట్ పోన్ పై నెలకున్న అనేక సందేహాలకు మేలో తెరపడనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot