సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ అప్‌డేట్

Posted By:

సీఈఎస్ 2014 వినూత్న ఆవిష్కరణలతో మారమోగుతున్న నేపధ్యంలో సామ్‌సంగ్ సరికొత్త నవీకరణకు శ్రీకారం చుట్టింది. గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ అప్‌డేట్‌ను సామ్‌సంగ్ ఇండియా విడుదల చేసింది. ఈ నవీకరణ పరిమాణం 400 ఎంబీ. గెలాక్సీ ఎస్3 యూజర్లు ఈ అప్‌డేట్‌ను ఓవర్ ద ఎయిర్ (వోటీఏ) అలాగే సామ్‌సంగ్ కైస్ (Samsung Kies) సాఫ్ట్‌వేర్ ద్వారా పొందవచ్చు.

గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

గెలాక్సీ ఎస్3 యూజర్లు 4.3 జెల్లీబీన్ అప్‌డేట్‌ను పొందటం ద్వారా క్నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్, స్మార్ట్‌స్విచ్, హోమ్ సింక్, గ్రూప్‌ప్లే 2.5, అప్‌డేటెడ్ ఇంటర్‌ఫేస్, డేడ్రీమ్ ఫీచర్, ట్రిమ్ సపోర్ట్, ఏఎన్ టి+ సపోర్ట్, కొత్త సామ్‌సంగ్ కీబోర్డ్, కొత్త లాక్‌స్ర్కీన్, కొత్త స్ర్కీన్ మోడ్స్ వంటి కొత్త ఫీచర్లు జతవుతాయి.

ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌కు సంబంధించి ఓవర్ ద ఎయిర్ (వోటీఏ) నోటిఫికేషన్‌ను పొందిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 యూజర్లు తమ ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి లోగినై అప్‌డేట్‌ను పొందవచ్చు. Settings >About Phone > Software update>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot