'జూన్ కలెక్షన్లపై ఆ రెండూ ధీమా?'

By Prashanth
|
Samsung Galaxy S3


జూన్ మార్కెట్‌‌ను రెండు అంశాలు ప్రభావితం చేసే అవకాశముందని పలువురు అంచనావేస్తున్నారు. వీటిలో సినీ ప్రపంచానికి చెందిన అంశం ఒకటి  కాగా, రెండోది టెక్నాలజీ విభాగానికి చెందినది.

దిగ్గజ బ్రాండ్ సామ్‌సంగ్, అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన ‘గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్’ను మే3న లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ప్రపంచవాప్తంగా హైప్ సృష్టిస్తున్నఈ గ్యాడ్జెట్‌ను భారత్‌లో జూన్ మొదటి వారం నుంచి విక్రయించనున్నారు. వీటి అమ్మకాలు భారీగా ఉండొచ్చని, ఈ పరిణామం జూన్ మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 16జీబి, 32జీబి, 64జీబి మెమెరీ వేరింయట్‌లలో లభ్యం కానుంది. రూ.38,000 నుంచి రూ.42,500 ధరల మధ్య వీటిని విక్రియించనున్నారు. ప్రత్యేకించి ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ కోసం సామ్ సంగ్ పలు ఉపకరణాలను లాంచ్ చేసింది. ఈ జాబితలో ఎస్ పెబ్బిల్ ఎంపీత్రీ ప్లేయర్, వైర్ లెస్ ఛార్జింగ్ కిట్, బ్యాటరీ స్టాండ్ తదితర అంశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, అత్యాధునిక సాంకేతిక విలువలతో క్రియోటివ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన చిత్రం ‘ఈగ’ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 30తేదీన విడుదల కాబోతుంది. సరికొత్త కథాంశంతో ఇంటిల్లిపాది చూడతగ్గ విశేషాలను ఈ చిత్రంలో  మేళవించటంతో వసూళ్ల పరంగా సినిమా  జూన్ రికార్డులను తిరగరాయటం ఖాయమని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళ వర్షన్‌లలో ఒకే రోజు విడుదలవుతున్న ఈ చిత్రం జూన్ మార్కెట్‌ను వసం చేసుకుంటుందని పబ్లిక్ టాక్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X