ఆ హిరో రేటు ఎంత..?

Posted By: Staff

ఆ హిరో రేటు ఎంత..?

 

సుధీర్ఠ ఎదురుచూపుల అనంతరం సామ్‌సంగ్ తన భవిష్యత్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3ని ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్2కు వారసునిగా డిజైన్ కాబడిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఈ హ్యాండ్‌సెట్లో నిక్షిప్తం చేసిన ఉపయుక్తమైన ఫీచర్లు కమ్యూనికేషన్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తాయి. ప్రకృతి స్పూర్తితో ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌కు రూపకల్పన చేసినట్లు తయారీదారు ప్రకటించారు. గులకరాయి ఆకృతిలో స్టైలిష్‌గా డిజైన్ కాబడిన ఈ ఫోన్ సమాచార అవసరాలను వేగవంతంగా తీర్చగలిగే అత్యాధునిన స్వభావాలను ఒదిగి ఉంది.

ఆపిల్ ఐఫోన్‌లో ఏర్పాటు చేసిన వాయిస్ కమాండ్ అప్లికేషన్ ‘సిరి’ తరహాలో ‘ఎస్ వాయిస్’ ఫీచర్‌ను గెలాక్సీ ఎస్3లో పొందుపరిచారు. ఈ సౌలభ్యతతో, మాటలు ఆధారితంగా ఫోన్ స్పందిస్తుంది. అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో సుసంపన్నమైన ‘గెలాక్సీ ఎస్3’ జూన్ తొలివారం నుంచి ఇండియాలో లభ్యం కానుంది. యూరోప్‌లో మే29నే ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది.  ఈ ఫోన్ గరిష్ట చిల్లర ధర రూ.38,000 కాగా, వినియోగదారుకు రూ.34,000కు విక్రయించనున్నట్లు సమచారం.

‘గెలాక్సీ ఎస్3’ మరో టాప్‌క్లాస్ స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్ X’కు గొప్ప పోటీదారుకానుంది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి... సమాన ధరను కలిగి ఉండటం, రెండు.. ఒకే విధమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్లను ఇమిడి ఉండటం.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot