రూమర్: భవిష్యత్ వ్యూహంలో మెగా ఫ్యామిలీ?

Posted By: Prashanth

రూమర్: భవిష్యత్ వ్యూహంలో మెగా ఫ్యామిలీ?

 

గెలాక్సీ కొత్త ఉత్పత్తుల ఎంపికతో ఖుషిఖుషిగా ఉన్న సామ్‌సంగ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్.. గెలాక్సీ ఎస్4తో పాటు రెండు కొత్త గెలాక్సీ ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నట్లు ‘సామ్ మొబైల్’(Sam Mobile) పేర్కొంది. ఈ వివరాలను కొరియా వర్గాల నుంచి సేకరించినట్లు సదరు సైట్ చెప్పుకొచ్చింది. 2013 ప్రధమాంకంలో అందుబాటులోకి రానున్న ఈ గాడ్జెట్‌లలో గెలాక్సీ ఎస్4తో పాటు మినీ గెలాక్సీ నోట్2, అసూస్ ట్రాన్స్ ఫార్మర్‌కు పోటీ టాబ్లెట్‌ను మెగా బ్రాండ్ సామ్‌సంగ్ ఆవిష్కరించనుందని సామ్ మొబైల్ తన నివేదికలో పేర్కొంది.

సామ్‌‌సంగ్ గెలాక్సీ ఎస్4: ఈ నిర్మాణానికి ‘‘ప్రాజెక్ట్ జే’’గా నామకరణం చేసినట్లు సమాచారం. రూమర్ స్సెసిఫికేషన్‌లను పరిశీలిస్తే...... హైడెఫినిషన్ ఆమోల్డ్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ కెమెరా, స్ర్కీన్ పరిమాణం 5 అంగుళాలు.

మినీ గెలాక్సీ నోట్ 2: గెలాక్సీ నోట్2కు మినీ వర్షన్‌‌గా డిజైన్ కాబడుతున్న ఈ ఫాబ్లెట్‌ను తక్కువ స్థాయి స్సెసిఫికేషన్‌లతో సామ్‌సంగ్ పరిచయం చేయనుందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా యూరోప్ మార్కెట్ పై సామ్‌సంగ్ దృష్టిసారించినట్లు సమాచారం.

కొత్త సామ్‌సంగ్ టాబ్లెట్: ఈ భారీ టాబ్లెట్‌ను అసూస్ ట్రాన్స్‌ఫార్మర్‌కు పోటీగా సామ్‌సంగ్ వృద్ధి చేస్తున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రూమర్ స్సెసిఫికేషన్‌లు:

- 13.3 అంగుళాల స్ర్కీన్,

- క్వర్టీ డాక్ ఆప్షన్,

- ఆపరేటింగ్ సిస్టం: క్రోమ్ లేదా ఆండ్రాయిడ్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot