సామ్‌సంగ్ ఫోన్ పై రూ.12,000 ధర తగ్గింపు

ఏప్రిల్, 2013లో సామ్‌సంగ్ నుంచి విడుదులైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4' తాజాగా ఇండియన్ మార్కెట్లో భారీ ధర తగ్గింపును అందుకుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 214 వేదికగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన నేపధ్యంలో ఈ ధర తగ్గింపుకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. విడుదల సమయంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 16జీబి వేరియంట్ ధర రూ.41,500. తాజా ధర తగ్గింపులో భాగంగా ఈ అధక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను రూ.29,199కి ఆన్‌లైన్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ShopClues.com ఈ ఆఫర్‌ను అమలులోకి తీసుకువచ్చింది. అంటే, గెలాక్సీ ఎస్4 కొనుగోలు పై వినియోగదారుడు రూ.12,000 వరకు రాయితీని పొందవచ్చు.
గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు:
ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications