గెలాక్సీ ఎస్4 ఆవిష్కరణ.. ఏప్రిల్‌లో మార్కెట్లోకి

Posted By:

 గెలాక్సీ ఎస్4 ఆవిష్కరణ.. ఏప్రిల్‌లో మార్కెట్లోకి
సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4'ను గురువారం న్యూయార్క్‌లోని మాన్హాటన్ ఐకానిక్ రేడియో సిటీ మ్యూజిక్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక అన్ ప్యాకెడ్ 2013 కార్యక్రమంలో ఆవిష్కరించింది.
డివైజ్ ఏప్రిల్ నుంచి మార్కెట్లో లభ్యంకానుంది. ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా డిజైన్ కాబడిన గెలాక్సీ ఎస్4 కీలక స్సెసిఫికేషన్‌లు....

మరిన్ని గెలాక్సీ ఎస్4 ఫోటోల కోసం క్లిక్ చేయండి:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
రిసల్యూషన్1080x 1920పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ / 1.6గిగాహెట్జ్ వోక్టా కోర్ ప్రాసెసర్ (ప్రాంతాన్ని బట్టి),
2జీబి ర్యామ్,
స్టోరేజ్ వర్షన్స్ (16/32/64 జీబి),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్/ఏసీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ),
బ్లూటూత్ 4.0, ఐఆర్ ఎల్ఈడి, ఎంహెచ్ఎల్ 2.0,
2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు,
ఫోన్ బరువు 130 గ్రాములు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot