విచిత్ర ప్రమాదం.. కరిగిపోయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

Posted By:

ఓ విచిత్ర ప్రమాద ఘటన 13 సంవత్సరాల బాలికను కలవరపాటుకు లోను చేసింది. వివరాల్లోకి వెళితే... ఉత్తర టెక్సాస్‌కు చెందిన 13 సంవత్సరాల బాలిక తన గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్‌ను దిండ క్రింద పెట్టి తన పనుల్లో నిమగ్నమైంది.

దిండి కింద పెట్టిన ఫోన్ నుంచి మంటలు

కొన్ని గంటల గడిచాక, కాలిన వాసనను పసిగట్టిన బాలిక తన గదిలోకి వచ్చి చూసేసరికి దిండి క్రింద మంటల్లో దహనమవుతున్న ఫోన్ కనిపించింది. ఫోన్ లోని బ్యాటరీ అధికవేడిని ఉత్పత్తి చేయటం ద్వారా ప్రమాదం తలెత్తిందని బాలిక తండ్రి తెలిపారు. సదరు ఫోన్‌లో అమర్చిన సెకండ్ హ్యాండ్ బ్యాటరీనే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని సామ్‌సంగ్ అధికారులు భావిస్తున్నారు. ఫాక్స్ 4 మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది.

బ్రాండెడ్ కంపెనీ సెల్‌ఫోన్ పేలటమన్నది సాధారణ విషయం కాదు. అయితే ఇలాంటి ఘటన ఏడాది క్రితం స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..... స్కాట్లర్ అనే 18 సంవత్సరాల మహిళ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3ని గత కొంత కాలంగా వినియోగిస్తోంది. అయితే హఠాత్తుగా స్కాట్లర్ ప్యాంట్ జేబులోని గెలాక్సీ ఫోన్ పేలుడుకు గురైంది. స్కాట్లర్ విధులు నిర్వహిస్తన్న పని కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసేకున్నట్లు సామ్‌సంగ్ స్విట్జర్లాండ్ వెల్లడించింది. ఫోన్ పేలుడు దాటికి స్కాట్లర్ తొడకు తీవ్ర గాయమైంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Galaxy S4 melts. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot