సామ్‍‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఇప్పుడు రూ.17,999కే

Posted By:

 సామ్‍‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఇప్పుడు రూ.17,999కే

దక్షిణ కొరియా బ్రాండ్ సామ్‌సంగ్ 2013కు గాను విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్4 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో రూ.17,999కే లభ్యమవుతోంది. ఫోన్ ఇదివరకు ధర రూ.21,900. అంటే రూ.3,999 ధర తగ్గింపును ఈ ఫోన్ పై పొందవచ్చు.

 సామ్‍‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఇప్పుడు రూ.17,999కే

సామ్‌సంగ్, గెలాక్సీ ఎస్4 ప్రీమియమ్ మోడల్ ఫోన్‌ను 2013లో విడుదల చేసింది. అప్పటి ధర రూ.41,500. గత నెలలోనే ఈ హ్యాండ్‌సెట్‌కు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్‌ను సామ్‌సంగ్ విడుదల చేసింది. ఈ అప్‌డేట్ సైజ్ 990 ఎంబీ. దీంతో ఫోన్ టచ్‌విజ్ ఇంటర్‌ఫేస్, నోటిఫికేషన్ ప్యానల్ విభాగాలు కొత్త లుక్‌లో దర్శనమిస్తాయి. గెస్ట్ మోడ్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌లాక్ వంటి కొత్త ఫీచర్లు ఫోన్‌కు జతవుతాయి. అంతేకాకుండా ఫోన్ సెక్యూరిటీ ఇంకా బ్యాటరీ బ్యాకప్ విభాగాలు మరింత బలపడతాయి.

 సామ్‍‌సంగ్ గెలాక్సీ ఎస్4 ఇప్పుడు రూ.17,999కే

సామ్‌సంగ్ ఇండియా గతేడాది పలు గెలాక్సీ సిరీస్ ఫోన్‌లకు సంబంధించి ధర తగ్గింపును ప్రకటించింది. ధర తగ్గింపు అందుకున్న ఫోన్‌లలో గెలాక్సీ గ్రాండ్ నియో, గెలాక్సీ గ్రాండ్ 2, గెలాక్సీ ఏస్ ఎన్ఎక్స్‌టీ, గెలాక్సీ స్టార్ అడ్వాన్స్, గెలాక్సీ గ్రాండ్ నియో, గెలాక్సీ ఎస్3 నియో, గెలాక్సీ స్టార్ 3 నియోలు ఉన్నాయి. 2014 ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ గెలాక్సీ ఎస్5 పైనా సామ్‌సంగ్ ధర తగ్గింపును ప్రకటించింది. ధర తగ్గింపులో భాగంగా సాధారణ గెలాక్సీ ఎస్5 వేరియంట్ ధర రూ.32,900. ఎల్టీఈ వేరియంట్ ధర రూ.40,300.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Samsung Galaxy S4 Price in India Slashed to Rs. 17,999. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot