బలపడుతున్న ఊహాగానాలు...?

Posted By: Prashanth

బలపడుతున్న ఊహాగానాలు...?

 

స్మార్ట్‌ఫోన్ కింగ్ సామ్‌సంగ్ నుంచి ప్రతిష్టాత్మకంగా విడుదలైన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3 ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న నేపధ్యంలో గెలాక్సీ ఎస్3 సక్సెసర్ వర్షన్ ‘గెలాక్సీ 4’పై టెక్ ప్రపంచంలో అనేక రూమర్లు వ్యక్తమవుతున్నాయి. ఈ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి మార్కెట్ వర్గాలు వాడివేడిగా చర్చించుకుంటున్నాయి. 2013లో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలక్సీ ఎస్4 స్పెసిఫికేషన్‌ల పై నెట్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న టాప్-6 ఫీచర్లు......

5 అంగుళాల 1080పికల్స్ బెండబుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే:

గెలాక్సీ ఎస్4 డిస్‌ప్లేకు సంబంధించి భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. పలు అనధికారిక నివేదికల ద్వారా సేకరించన సమాచారం మేరకు గెలాక్సీ ఎస్4.. 5 అంగుళాల ఓఎల్ఈడి హైడెఫినిష్ డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. రిసల్యూషన్ సామర్ధ్యం 1920 x 1080పిక్సల్స్. మరికొన్ని రిపోర్టులు గెలాక్సీ ఎస్4 బెండబుల్ డిస్‌ప్లే టెక్నాలజీతో రూపుదిద్దుకోనుందని అంచనా వేస్తున్నాయి.

2గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్:

గెలాక్సీ ఎస్4‌లో సామ్‌సంగ్ ఎక్సినోస్ ఎస్450 చిప్‌సెట్‌తో కూడిన 2గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ15 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసినట్లు పలు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

13 మెగా పిక్సల్ కెమెరా ఆన్-బోర్డ్:

భారీ అంచనాలతో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4లో ఐట్రాకింగ్ టెక్నాలజీతో కూడిన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వినియోగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆండ్రాయిడ్ 4.2 లేదా ఆండ్రాయిడ్ 5.0:

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ లేదా రేపటితరం ఆండ్రాయిడ్ 5.0 వోఎస్‌ను రాబోయే గెలాక్సీ ఎస్4లో ఉపయోగించవచ్చన్న ఊహాగానాలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి.

స్టోరేజ్:

గెలాక్సీ ఎస్4 స్టోరేజ్ అంశానికి సంబంధించి అనేక వార్తలు వ్యక్తమవుతున్నాయి. 16జీబి/32జీబి/64జీబి/128జీబి వేరియంట్‌లలో గెలాక్సీ ఎస్4ను డిజైన్ చేస్తున్నట్లు టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

విడుదల ఎప్పుడు:

సామ్‌సంగ్ ఈ లేటెస్ట్ వర్షన్ గెలాక్సీ డివైజ్‌ను 2013 ఫిబ్రవరిలో ఆవిష్కరించేందకు సన్నాహాలు చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

పలు నివేదికలు ఆధారంగా సేకరించిన గెలాక్సీ ఎస్4 ఫీచర్లు (ఊహాజనితంగా):

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot