మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 మినీ

Posted By:

గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌కు మినీ వర్షన్‌గా ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన గెలాక్సీ ఎస్5 మినీ డ్యూయోస్‌ను సామ్‌సంగ్ ఇండియా మంగళవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.26,499. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ల‌ను నేటి నుంచి విక్రయిస్తోంది. డస్ట్ ఇంకా వాటర్ ప్రూఫ్ కోటింగ్‌తో డిజైన్ కాబడిన ఈ ఫోన్ దుమ్ము ఇంకా నీటి ప్రమాదాలను కొంతమేర తట్టుకోగలుగుతుంది. హార్ట్ రేట్ మానిటర్ ఫీచర్ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 మినీ

గెలాక్సీ ఎస్5 మినీ ప్రత్యేకతలు:

4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (720 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్ క్వాలిటీతో),
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఎస్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ),
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Galaxy S5 Mini Duos Now Available At 26,499. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot