సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5@రూ.51,500
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా సామ్‌సంగ్ ఆవిష్కరించిన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లభ్యమవుతోంది. ధర రూ.51,500. నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ 125 దేశాల్లో లభ్యంకానుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, హార్ట్‌రేట్ సెన్సార్, సరికొత్త టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్, ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ వంటి ఆధునిక ఫీచర్లును గెలాక్సీ ఎస్5లో పొందుపరిచారు.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన గెలాక్సీ ఎస్5 వర్షన్‌లో ఎక్సినోస్ ఆక్టా కోర్ సీపీయూ వ్యవస్థను నిక్షిప్తం చేసారు. ఫోన్ ముందు భాగంలో బహుళ ఉపయోగకర ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలానే ఫోన్ వెనుక భాగంలో హార్ట్ - రేట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెక్యూరిటీ అలానే పేపాల్ ద్వారా బిల్లులు చెల్లించే సమయంలో ఉపయోగించుకోవచ్చు.
గెలాక్సీ ఎస్5 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే 5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్) 432 పీపీలై, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ చిప్ సెట్ అడోనిస్ ప్రైమ్ 2 (క్వాడ్ 1.9గిగాహెట్జ్ + క్వాడ్ 1.3గిగాహెట్జ్)+ ఎక్స్ఎమ్ఎమ్6360, 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications