సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ ఎస్5 పై రూ.8,000 రాయితీ

Posted By:

 సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ ఎస్5 పై రూ.8,000 రాయితీ

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి తాజాగా విడుదలైన అధికముగింపు స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5 (Galaxy S5). ఇండియన్ మార్కెట్లో ఈ ఖరీదైన స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ధరను రూ.51,500గా కంపెనీ నిర్థారించింది. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న సగటు భారతీయుడికి ఈ ధర తలకు మించిన భారం. ఈ క్రమంలో గెలాక్సీ ఎస్5 ఒక వర్గానికి మాత్రమే పరిమితమనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో సామ్‌సంగ్ అభిమానులకు ఊరటనిస్తూ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజాలు గెలాక్సీ ఎస్5 కొనుగోలు పై ప్రత్యేకమైన ధర రాయితీలను ప్రకటించాయి. వాటి వివరాలను పరిశీలించినట్లయితే....

భారత దేశపు అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ ఎస్5 పై 8,000 ధర రాయితీని ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా గెలాక్సీ ఎస్5ను రూ.43,499కి సొంతం చేసుకోవచ్చు. మరో థర్డ్-పార్టీ అమ్మకందారు డబ్ల్యూఎస్ రిటైల్ (WS Retail) గెలాక్సీ ఎస్5ను రూ.44,942కు ఆఫర్ చేస్తోంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ స్టోర్ The Mobile Store  గెలాక్సీ ఎస్5ను రూ.44,999కి ఆఫర్ చేస్తోంది. మరో రిటైలర్ అమెజాన్ గెలాక్సీ ఎస్5ను ప్రత్యేక తగ్గింపు ధర పై 45,999కి ఆఫర్ చేస్తోంది. మరో రిటైలర్ Snapdeal గెలాక్సీ ఎస్5ను రూ.44,786కు ఆఫర్ చేస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot