విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 (రివ్యూ)

|

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడుదలైన ఫోన్ గెలాక్సీ ఎస్5. హార్ట్ రేట్ మానిటర్, ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్‌కు మార్కెట్లో ఇప్పటికి మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో విడుదలైన గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్ రెండు క్వాడ్ చిప్‌సెట్‌లను కలిగి ఉన్న ఎక్సినోస్ ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇండియన్ మార్కెట్లో 4జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవటంతో గెలాక్సీ ఎస్5 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే అవకాశం లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 - డిస్‌ప్లే మరియు డిజైనింగ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ఇంచుమించుగా గెలాక్సీ ఎస్ 4 తరహాలోనే కనిపిస్తుంది. అయితే, గెలాక్సీ ఎస్5 వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్యానల్ ఇప్పటి వరకు విడుదలైన అన్ని గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో గెలాక్సీ ఎస్5 శరీర నిర్మాణాన్ని చేపట్టారు. ఎల్ఈడి ఫ్లాష్‌తో అనుసంధానించబడిన హార్ట్‌రేట్ మానిటర్ సెన్సార్‌ను ఫోన్ వెనక భాగంలో ఏర్పాటు చేసారు.

గెలాక్సీ ఎస్5 డిస్‌ప్లే విషయానికొస్తే 5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను గెలాక్సీ ఎస్5 ముందు భాగంలో ఏర్పాటు చేసారు ( రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్). ఫోన్ పరిమాణం 142.0 x 72.5 x 8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు. గెలాక్సీ ఎస్4‌తో పోలిస్తే గెలాక్సీ ఎస్5 బరువు కాస్తంత ఎక్కువే. గెలాక్సీ ఎస్5 డస్ట్ రెసిస్టెంట్ అలానే వాటర్ ప్రూఫ్ ఫీచర్లను కలిగి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని  అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. నీటిలో కొద్ది నిమిషాలు నానినప్పటికి గెలాక్సీ ఎస్5కు ఏ విధమైన హానీ కలగదు. ఇలాంటి ప్రత్యేకత ఐఫోన్ 5ఎస్‌లో లోపించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రత్యేకమైన హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింది ఏర్పాటు చేయబడని ఈ హార్ట్ రేట్ మానిటర్ మీ గుండె వేగాన్ని విశ్లేషించగలదు. ఈ తరహా ఫీచర్ ఐఫోన్ 5ఎస్‌లో లేదు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు
 
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5, 16 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. ఐఫోన్ 5ఎస్ 8 మెగా పిక్సల్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5, 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. అయితే, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా గెలాక్సీ ఎస్5 స్టోరేజ్ మెమరీని 128జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ తరహా స్టోరేజ్ ఫీచర్ ఐఫోన్‌5‌లో లేదు.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని  అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5 లైవ్ హెచ్‌డీఆర్ ప్రివ్యూ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ తరహా ఫీచర్ ఏ ఫోన్‌లోనూ లేదు.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని  అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ డివైస్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది. ఈ సెన్సార్ వ్యవస్థను ఫోన్ హోమ్ బటన్ పై భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని  అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5 వీడియోలను 4కే రిసల్యూషన్ (4 రెట్ల హైడెఫినిషన్ రిసల్యూషన్) క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని  అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకోవచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని  అత్యుత్తమ ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5‌లోని అత్యుత్తమ ఫీచర్లు

పవర్ - సేవింగ్ మోడ్ ఫీచర్‌

గెలాక్సీ ఎస్5 ప్రత్యేకమైన పవర్ - సేవింగ్ మోడ్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్ బ్యాటరీ శక్తి తక్కువుగా ఉన్న సమయంలో ఈ ఫీచర్ అటోమెటిక్‌గా స్పందించి బ్యాటరీ శక్తిని అదా చేసే ప్రయత్నం చేస్తుంది.

విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 (రివ్యూ)

గెలాక్సీ ఎస్5 పనితీరుకు సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణాత్మక రివ్యూను ఈ వీడియోలో చూడొచ్చు...

గెలాక్సీ ఎస్5 పనితీరుకు సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/SBU0l35BRFc?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

గెలాక్సీ ఎస్5 ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే ఈ ఆపరేటింగ్ సిస్టంను కొత్త వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయనున్నారు. రెండు క్వాడ్‌ కోర్ (1.9గిగాహెట్జ్ + 1.3గిగాహెట్జ్) చిప్‌లతో కూడిన ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను గెలాక్సీ ఎస్5‌లో నిక్షిప్తం చేసారు. అలానే 2జీబి ర్యామ్ గెలాక్సీ ఎస్5 పనితీరును మరింత బలోపేతం చేస్తుంది. గెలాక్సీ ఎస్5లో 16జీబి ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఈ మెమెరీ స్థాయిని మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 128జీబి వరకు విస్తరించుకోవచ్చు. 2,800ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థను గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసారు.

గెలాక్సీ ఎస్5, 16 మెగా పిక్సల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. అలానే, ఫోన్ ముందుగా భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా ద్వారా వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు.

గెలాక్సీ ఎస్5లో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ డివైస్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేస్తుంది. ఈ సెన్సార్ వ్యవస్థను ఫోన్ హోమ్ బటన్ పై భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. ‘హార్ట్-రేట్ సెన్సార్' పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఈ డివైస్‌లో ఏర్పాటు చేసారు.

ఈ సెన్సార్‌ను ఫోన్ వెనుక భాగంలో కెమెరా ఫ్లాష్ క్రింది ప్రాంతంలో నిక్షిప్తం చేసారు. యూజర్ ఈ సెన్సార్ పై తన వేలిని కొద్ది సెకన్లు ఉంచినట్లయితే ఎల్ఈడి లైట్ రక్త ప్రసరణను నమోదు చేసి ఆ వివరాలను సెన్సార్‌కు పంపుతుంది. తద్వారా మీ హార్ట్ రేట్ ఫోన్ తెర పై ప్రత్యక్షమవుతుంది. ఈ హార్ట్-రేట్ సెన్సార్ ఫీచర్ ఎస్ హెల్త్ అప్లికేషన్‌లో ఓ భాగంగా స్పందిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X