ఏప్రిల్ ఆరంభంలో భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

Posted By:

ఏప్రిల్ ఆరంభంలో భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

సామ్‌సంగ్ తరువాతి వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్6 ఏప్రిల్ ఆరంభంలో భారత్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చి 2 నుంచి 5 వరకు బార్సిలోనా వేదికగా నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015లో ఈ హై ఫీచర్ ఫోన్‌ను సామ్‌సంగ్ ఆవిష్కరించనుంది. వచ్చే నెలలోనే ఈ డివైస్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6కు సంబంధించి పలు ఆసక్తికర రూమర్లు

ఏప్రిల్ ఆరంభంలో భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

గెలాక్సీ ఎస్6 మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉండే అవకాశం. 2కే డిస్‌ప్లే ఇంకా ట్విన్ ఎడ్జ్ స్ర్కీన్స్ కలిగి ఉండే అవకాశం. గెలాక్సీ ఎస్6 నాలుగు కలర్ వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. డార్క్ బ్లూ, బ్లూ గ్రీన్, గోల్డ్ ఇంకా వైట్.సామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్పోస్ ప్రాసెసర్ పై గెలాక్సీ ఎస్6 రన్ అయ్యే అవకాశం. గెలాక్సీ ఎస్6 4జీబి ర్యామ్‌తో లభ్యమయ్యే అవకాశం.

ఏప్రిల్ ఆరంభంలో భారత్‌లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

గెలాక్సీ ఎస్6లో అప్‌గ్రేడెడ్ ఐఎమ్ఎక్స్240 కెమెరా సెన్సార్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. ఫోన్ ప్రధాన కెమెరా 16 లేదా 20 మెగా పిక్సల్ ఉండొచ్చు. సెకండరీ కెమెరా సామర్థ్యం 5 మెగా పిక్సల్ వరకు ఉండొచ్చు. స్టోరీ ఆల్బమ్, ఎస్ ట్రాన్స్‌లేటర్, ఎస్ వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ డివైస్‌లో చూడొచ్చు. గెలాక్సీ ఎస్6 32జీబి, 64జీబి అలానే 128జీబి వర్షన్ లలో లభ్యమయ్యే అవకాశం.32జీబి ధర రూ.54,700, 64జీబి ధర రూ.62,00, 128జీబి వర్షన్ ధర రూ.69,300 వరకు ఉండొచ్చు.

English summary
Samsung Galaxy S6 India launch scheduled for early April. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot