గెలాక్సీ ఎస్7,ఎస్7 ఎడ్జ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ఎస్7 ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల ప్రకారం మీరు రూ. 20 వేల డిస్కౌంట్ తో ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

వాట్సప్‌కు పేటీఎమ్ దిమ్మతిరిగే షాక్..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎస్7 కొన్నవారికి

గెలాక్సీ ఎస్7 కొన్నవారికి రూ. 4 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు పాత ఫోన్ల ఎక్స్చేంజ్ తో గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ని కొంటే రూ. 12 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

రూ. 23,400కే

మార్కెట్లో దీని ధర రూ. 39,400గా ఉంది. మీరు పై ఆఫర్ల ద్వారా దీన్ని రూ. 23,400కే సొంతం చేసుకోవచ్చు.

32జిబి కొన్నవారికి

గెలాక్సీ ఎస్7ఎడ్జ్ 32జిబి కొన్నవారికి రూ. 8 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు పాత ఫోన్ల ఎక్స్చేంజ్ తో దీన్ని కొంటే రూ. 12 వేల వరకు డిస్కంట్ పొందవచ్చు.

రూ. 28,900కే

మార్కెట్లో దీని ధర రూ. 48,900గా ఉంది. మీరు పై ఆఫర్ల ద్వారా దీన్ని రూ. 28,900కే సొంతం చేసుకోవచ్చు.

24 నెలలతో కూడిన ఈఎంఐ ఆప్షన్

వీటితో పాటు శాంసంగ్ 24 నెలలతో కూడిన ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తోంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ రీటెయిల్ స్టోర్లలో ఈ ఆఫర్ తో మీరు ఫోన్ సొంతం చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S7, S7 edge Independence Day sale includes up to Rs. 20,000 discount Read more aat gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting