శాంసంగ్ బంపరాఫర్, ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్

Written By:

శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెండు గెలాక్సీలు ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. లాంచింగ్‌ సందర్భంగా రూ.74,900గా ఉన్న ఈ వేరియంట్‌ ధర, ప్రస్తుతం శాంసంగ్‌ అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌లో 70,900 రూపాయలకే అందుబాటులో ఉంది. అంటే 4వేల రూపాయల మేర ధరను తగ్గించేసింది. అయితే తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేది ఇంకా స్పష్టంకాలేదు.

ఈ ఫోన్ల ధరలు రూ.3వేలు తగ్గాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఎంఓపీ

ఈ కొత్త ధర కొత్త ఎంఓపీ అని, శాశ్వతంగా ఈ ఫోన్‌పై శాంసంగ్‌ రేటును తగ్గించినట్టు ముంబైకు చెందిన ఆఫ్‌లైన్‌ రిటైలర్‌ మహేష్‌ టెలికాం చెబుతోంది.

128జీబీ వేరియంట్‌ను

ఈ ధర తగ్గింపుతో పాటు 128జీబీ వేరియంట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలుచేసిన వారికి బంపర్‌ ఆఫర్లకు కూడా ప్రకటించింది.

జియో యూజర్లు

రిలయన్స్‌ జియో యూజర్లు ఈ ఫోన్‌ను కొనుగోలుచేస్తే రూ.309, రూ.509 ప్లాన్స్‌పై రెండింతలు డేటా ఆఫర్‌ చేయనుంది. ఈ రెండింతలు డేటా యూజర్లకు 48 గంటల్లోనే క్రెడిట్‌ కానుంది.

క్యాష్‌ బ్యాక్‌

అదేవిధంగా పాత ఫోన్‌తో కొత్తగా ఈ ఫోన్‌ను కొనుగోలుచేస్తే ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై 3000 రూపాయల క్యాష్‌ బ్యాక్‌, ఉచితంగా రూ.4,499 విలువైన వైర్‌లెస్‌ ఛార్జర్‌ ఇవ్వనుంది.

ఈఎంఐ ఆప్షన్లు

ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐ ఆప్షన్లు కూడా గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై శాంసంగ్‌ అందుబాటులో ఉంచింది. ఆశ్చర్యకరంగా ఈ ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై లేవు. అధికారిక తన ఆన్‌లైన్‌ స్టోర్‌లోనే అందిస్తున్నట్టు తెలిసింది.

గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్పెషిఫికేషన్లు...

6.2 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 1440x2960 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌

ర్యామ్‌

6 జీబీర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌

కెమెరాలు

12ఎంపీ డ్యూయల్‌ పిక్సెల్‌ రియర్‌ కెమెరాలు , 8 ఎంపీ సెల్పీ కెమెరా విత్‌ మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్ , ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S8+ 128GB variant price reportedly slashed in India read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot