శాంసంగ్ బంపర్ ఆఫర్...గెలాక్సీ S8+ పై 5వేలు తగ్గింపు

రెండు నెలల్లోనే రెండు సార్లు ధరను తగ్గించిన సామ్ సంగ్

By Madhavi Lagishetty
|

శాంసంగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ S8+ ధరను భారత మార్కెట్లో మరోసారి తగ్గింది. గెలాక్సీ S8+యొక్క 6జిబి ర్యామ్ వేరియంట్ ఇప్పుడు 5వేల రూపాయలు తగ్గింది. రెండు నెలల్లోనే రెండుసార్లు ధరను తగ్గించింది కంపెనీ. ఇప్పుడు 65,900రూపాయలకు అందుబాటులో ఉంది. గత నెలలో గెలాక్సీ S8+ 6జిబి ర్యామ్ వేరియంట్లో 4000వేల రూపాయల వరకు తగ్గించింది.

 
Samsung Galaxy S8+ 6GB variant gets Rs. 5,000 price cut in India

శాంసంగ్ న్యూ హ్యాండ్ సెట్ ప్రారంభానికి ముందు దాని ప్రధాన స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గిపోయాయని తెలుసు. కొరియా టెక్ దిగ్గజం ఇటీవల గెలాక్సీ నోట్ 8 ఫాబ్లెట్ ను శాంసంగ్ గెలాక్సీ ప్యాక్ చేయని ఈవెంట్ లో ప్రదర్శించింది. ఇది త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రానుంది.

గెలాక్సీ నోట్ 8 అనేది ఇప్పటి వరకు ఉన్న అత్యంత ఆధునాతన శాంసంగ్ నోట్ డివైస్. గెలాక్సీ నోట్ 7 వంటి న్యూ డివైస్ మళ్లీ వస్తాయా లేదా అనేది రిసెర్చ్ ఇంజనీరింగ్ వర్క్ నిర్ధారించుకోవల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

 

ఇండియాలో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ !ఇండియాలో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ !

శాంసంగ్ గెలాక్సీ S8+, స్మార్ట్ ఫోన్ 12జిబి కెపాసిటి స్టోరెజీ మరియు 6జిబి ర్యామ్ తో వస్తుంది. ఇది 2960x 1440పిక్సెల్స్ రిజల్యూషన్ తోపాటు 6.2అంగుళాల సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఇన్ఫినిటి డిస్ ప్లే ప్యానెల్ ఆల్ట్రా వైడ్ స్క్రీన్ కారణంగా 18:5:9యొక్క రేషియోని కలిగి ఉంది. గెలాక్సీ S8+ కంపెనీ యొక్క ఎక్సీనోస్ 8895SoCను ఉపయోగించుకుంటుంది.

12మెగాపిక్సల్ డ్యుయల్ మెయిన్ స్నాపర్ తో పాటు . f/1.7ఎపర్చర్ తో OISను కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా మరియు ఆటో ఫోకస్ తో ఉంటుంది. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్లో 128జిబి స్టోరెజీ కెపాసిటిని 256 వరకు విస్తరించవచ్చు.

గెలాక్సీ S8+కనెక్టీవిటీ ఆస్పాక్ట్స్ 4జి ఎల్టీఈ, బ్లూటూత్ 5.0 USB టైప్ –సి-పోర్ట్ మరియు NFCలను కలిగి ఉంది. సామ్ సంగ్ పే సపోర్ట్ ఉంది. స్మార్ట్ ఫోన్లో ఐరిస్ స్కానర్, ఫేస్ రికగ్నైజ్ , ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జీంగ్ ఇచ్చే 35000ఎంఏహెచ్ యూనిట్ ను కలిగి ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung has dropped the price of Galaxy S8+ by Rs. 5,000 in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X