శాంసoగ్ గెలాక్సీ S8 బర్గండీ రెడ్ వేరియంట్ ఇండియాలో విడుదల

2017 లో రిలీజ్ చేసిన శాంసoగ్ S8 ఫ్లాగ్షిప్ మొబైల్ ను సరికొత్త రంగులో ఇండియాలో ఆవిష్కరించింది. అన్నీ రీటైల్ షాపుల్లో లభ్యమయ్యేలాగా బర్గండీ రెడ్ వేరియంట్ లో విడుదల చేశారు.

|

2017 లో రిలీజ్ చేసిన శాంసoగ్ S8 ఫ్లాగ్షిప్ మొబైల్ ను సరికొత్త రంగులో ఇండియాలో ఆవిష్కరించింది. అన్నీ రీటైల్ షాపుల్లో లభ్యమయ్యేలాగా బర్గండీ రెడ్ వేరియంట్ లో విడుదల చేశారు. 2017 లో శాంసంగ్ గెలాక్సీ S8, 57,990 రూపాయలకు ఇండియాలో లాంచ్ అయింది, ఈ సరికొత్త వేరియంట్ ను 49,990 రూపాయలకు ప్రత్యేక ధర తగ్గింపుతో విడుదల చేయడం ఆహ్వానించదగ్గ విషయం. విడుదలయ్యి సంవత్సరం గడుస్తున్నా , గెలాక్సీ S8 ఇప్పటికీ మంచి మార్కెట్ తో దూసుకెళ్తున్న మొబైల్స్ లో ఒకటిగా ఉంది.

 
Samsung Galaxy S8 Burgundy Red variant

ఇప్పుడు వస్తున్న ఈ పరిమిత సంఖ్యలోని మొబైల్స్, వినియోగదారుల మనసు చూరగొంటుంది అనడంలో ఆశ్చర్యంలేదు. ఈ ఎడిషన్ లాంచింగ్ సమయంలో , శాంసంగ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆదిత్య బబ్బర్ చెప్పిన ప్రకారo ఈ శాంసంగ్ బర్గండీ రెడ్ ఎడిషన్, వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా ట్రెండీగా ఉంటుందని, అబ్బురపరచే రంగుతో ప్రజలచేత వావ్ అనిపించేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు". ఈ స్పెషల్ ఎడిషన్ తో కలిపి, గెలాక్సీ S8 ఇండియాలో 4 రంగులలో లభ్యం అవుతుంది. మిడ్నైట్ బ్లాక్, మాపుల్ గోల్డ్, ఆర్చిడ్ గ్రే, మరియు బర్గండీ రెడ్.

 

ఇక స్పెసిఫికేషన్స్ పరoగా చూస్తే, శాంసంగ్ S8 5.8 సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే , QHD + 1440x2960 పిక్సెల్స్ రిసొల్యూషన్ కలిగి ఉంటుంది. ఆక్టాకోర్ ఎక్సినోస్ 8895 ప్రాసెసర్ కలిగి ఉండి, 4 GB రామ్ , 64 GB అంతర్గత మెమొరీని కలిగి ఉంటుంది. దీనిని SD కార్డ్ ద్వారా 256 gb వరకూ పెంచుకునే సౌలభ్యం కూడా ఉన్నది.

ఇక కెమరా విషయానికి వస్తే డ్యూయల్ 12 ఎం‌పి ఆటో ఫోకస్ కెమరా కలిగి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో , f/1.7 ఆపర్చర్ , 8x zoom తో వస్తుంది. మరియు ఇందులో ప్రొ మోడ్ , panorama మోడ్ , స్లో మోషన్, hyperlapse, food mode వంటి సరికొత్త హంగులతో పాటు ఫోటోలను RAW ఫైల్ ఫార్మెట్ లో సేవ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇక ఫ్రంట్ కెమరా కి వస్తే 8 మెగా పిక్సెల్ కెమరా కలిగి f/1.7 ఆపర్చర్ తో సెల్ఫీ కోసం wide angle లెన్స్ ను సైతం కలిగి ఉంటుంది. కెమరా డిపార్ట్మెంట్ అద్భుతమనే చెప్పాలి.

పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లయి చేయడం ఎలా ?పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లయి చేయడం ఎలా ?

శాంసంగ్ గెలాక్సీ S8 3000 mah బాటరీ తో ఫాస్ట్ చార్జింగ్ మరియు వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో విడుదల అయినా కూడా ఇప్పుడు oreo తో నడుస్తుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ s8, 4G LTE (Cat. 16), Wi-Fi 802.11ac (2.4GHz, 5GHz), Bluetooth v5.0, USB Type-C, NFC, మరియు GPS కనెక్టివిటీ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. మరియు శాంసంగ్ పే, బిక్స్బీ వర్చ్యువల్ అసిస్టెంట్ వంటి సరికొత్త హంగులను కలిగి వినియోగదారుల మనసు చూరగొంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S8 Burgundy Red variant launched in India Read more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X