సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 వచ్చేసింది, ఇవే ఫీచర్లు

సామ్‌సంగ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్‌ఫోన్‌లు ఆదివారం రాత్రి న్యూయార్క్‌లో విడుదలయ్యాయి. 2017 అన్ ప్యాకుడ్ ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ ఈ హై-ఎండ్ ఫోన్‌లను ఆవిష్కరించింది. ఏప్రిల్ 21 నుంచి అమెరికన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మిడ్‌నైట్ బ్లాక్, ఆర్చిడ్ గ్రే, ఆర్కిటిక్ సిల్వర్, కోరల్ బ్లూ, మాపిల్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను సొంతం చేసుకోవచ్చు..

Read More : మైక్రోమాక్స్ డ్యుయల్ కెమెరా ఫోన్ వచ్చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ ఇంకా డిస్‌ప్లే

గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌లు పూర్తిస్ధాయి bezel-less డిస్‌ప్లేలతో వస్తున్నాయి. గెలాక్సీ ఎస్8, 5.8 అంగుళాల క్యూహైడెఫినిషన్+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1440x2960 పిక్సల్స్)తో వస్తోండగా, గెలాక్సీ ఎస్8+ మోడల్ 6.2 అంగుళాల క్యూహైడెఫినిషన్+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 1440x2960 పిక్సల్స్)తో వస్తోంది. IP68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న ఈ డిస్‌ప్లేలు నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకుంటాయి.

ప్రాసెసర్

గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌లు ఆక్టా కోర్ (2.3GHz క్వాడ్ + 1.7GHz క్వాడ్), 64 బిట్, 10ఎన్ఎమ్, ఆక్టా కోర్ (2.3GHz క్వాడ్ + 1.9GHz క్వాడ్), 64 బిట్, 10ఎన్ ప్రాసెసర్ లతో వస్తున్నాయి. క్వాల్కమ్ అభివృద్ధి చేసిన లేటెస్ట్ చిప్‌సెట్‌లో వీటిని పొందిపరిచారు.

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 4జీబి ర్యామ్ ఇంకా 64జీబి ఇన్ బిల్ట్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తున్నాయి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

సాఫ్ట్‌వేర్

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ సిస్టం పై రన్ అవుతాయి.

కెమెరా విషయానికి వచ్చేసరికి

ఈ రెండు ఫోన్‌లు 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలత పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా 4కే క్వాలిటీ వీడియోతో పాటు 1080 పిక్సల్ క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎఫ్1.7 అపెర్చుర్, 8ఎక్స్ జూమ్, ప్రో మోడ్, పానోరమా, స్లో మోషన్, హైపర్‌ల్యాప్స్, ఫుడ్ మోడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

బ్యాటరీ కెపాసిటీ..

ఇక బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి.. గెలాక్సీ ఎస్8 మోడల్ 3000mAh బ్యాటరీ కెపాసిటీతో, ఎస్8+ మోడల్ 3500mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్నాయి. వైర్‌లెస్ చార్జింగ్‌తో పాటు ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఈ బ్యాటరీలు సపోర్ట్ చేస్తాయి.

కనెక్టువిటీ ఫీచర్లు..

ఈ రెండు ఫోన్‌లు సింగిల్ సిమ్ అలానే డ్యుయల్ సిమ్ మోడల్స్‌లో అందుబాటులో ఉంటాయి. 4జీ ఎల్టీఈ, బ్లుటూత్ వీ5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, ఐరిస్ సెన్సార్, ప్రెజర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్, గైరోస్కోప్, హార్ట్ రేట్ సెన్సార్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ఈ ఫోన్‌లలో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S8 and Galaxy S8+ launched:Price Specifications and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot