8జీబి ర్యామ్, 256జీబి స్టోరేజ్

2017లో సామ్‌సంగ్ తన అప్‌‌కమింగ్ గెలాక్సీ ఎస్8 స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో వేరియంట్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. గెలాక్సీ నోట్ 8 స్దానంలో నోట్ 8 ప్లస్‌ను సామ్‌సంగ్ పరిచయం చేయబోతున్నట్లు అనధికారికంగా తెలుస్తోంది. 6 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ప్లస్ వేరియంట్‌కు 8జీబి ర్యామ్ ప్రధాన ఆకర్షణ కానుందట...

Read More : ఇలా చేస్తే.. ఐదే ఐదు నిమిషాల్లో మీ ఫోన్ స్పీడ్ పెరుగుతుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొరియా ఎంకే న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం...

సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్8 వేరియంట్‌తో పాటు గెలాక్సీ ఎస్8 ప్లస్ వేరియంట్ ను కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్న సమాచారం. గెలాక్సీ నోట్ 7 పూర్తిగా విఫలమైన నేపథ్యంలో నోట్ లైనప్‌ను సామ్‌సంగ్
పూర్తిగా నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూమర్స్ ప్రకారం..

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న అనేక రూమర్స్ ప్రకారం.. గెలాక్సీ ఎస్8 ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 లేదా ఎక్సినోస్ 8895 చిప్‌సెట్‌లతో వచ్చే అవకాశం.

స్టోరేజ్ వేరియంట్స్..

స్టోరేజ్ వేరియంట్స్ వచ్చేసరికి 128జీబి, 256జీబి స్టోరేజ్ వర్షన్‌లలో గెలాక్సీ ఎస్8 అందుబాటులో ఉండే అవకాశం.

డ్యుయల్ కెమెరా సెటప్‌

కెమెరా విషయానికి వచ్చేసరికి 16 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌ను గెలాక్సీ ఎస్8 కలిగి ఉండబోతోంది. 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా ఈ ఫోన్ కలిగి ఉండే అవకాశం.

ఇతర ఫీచర్లు..

ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉండవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung Galaxy S8 leak hints at 6-inch display, 8GB of RAM. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting