శాంసంగ్ ఎస్8, నోట్8లలో కొత్త ఎడిషన్, పేలిన ఫోన్..
శాంసంగ్ తన అభిమానుల కోసం సరికొత్త కానుకను అందించబోతోంది.ఇదిలా ఉంటే శాంసంగ్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది
శాంసంగ్ తన అభిమానుల కోసం సరికొత్త కానుకను అందించబోతోంది. అమ్మకాల్లూ దుమ్ము రేపుతున్న గెలాక్సీ నోట్8, గెలాక్సీ ఎస్8లలో 'ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్' వేరియంట్లను శాంసంగ్ విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్లు బిజినెస్ టూ బిజినెస్ ప్రొడక్ట్‌లు, బిజినెస్ వాడకాన్ని లక్ష్యంగా చేసుకుని మార్కెట్‌లోకి వచ్చాయి.
గెలాక్సీ ఎస్8, నోట్ 8 ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్‌ల తయారీ గ్యారెంటీని శాంసంగ్ మూడేళ్లు పొడిగించింది. అయితే ఈ కొత్త వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడించలేదు. సాఫ్ట్‌వేర్‌ను మినహాయిస్తే, మిగతా స్పెషిఫికేషన్లన్నీ ముందస్తు వెర్షన్లకు ఈ వేరియంట్లకు ఒకేవిధంగా ఉన్నాయి.

గెలాక్సీ ఎస్8 ఫీచర్లు
5.8 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరుజ్
12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

గెలాక్సీ నోట్8 ఫీచర్లు
6.3 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ షూటర్
3300 ఎంఏహెచ్ బ్యాటరీ

స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది
ఇదిలా ఉంటే శాంసంగ్ కంపెనీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ మళ్లీ పేలింది. అయితే ఈ సారి పేలుడు ఘటను చోటుచేసుకుంటున్న గెలాక్సీ నోట్7 కాదు, శాంసంగ్ గ్రాండ్ డ్యూస్ స్మార్ట్‌ఫోన్ అట.

ఆయన జేబులో నుంచి హీటింగ్ సెన్సేషన్
డైలీ మెయిల్ రిపోర్టు ప్రకారం, 47 సంవత్సరాల హోటల్ సూపర్ వైజర్ యులియాన్టో ఇండోనేషియాలోని ఓ హోటల్ లాబీలో వేచి చూస్తున్నాడు. ఒక్కసారిగా ఆయన జేబులో నుంచి హీటింగ్ సెన్సేషన్ రావడం మొదలైంది. అనంతరం ఒక్కసారిగా జేబులోనే ఫోన్ పేలిపోయింది.

యులియాన్టో ముఖానికి గాయాలు
పేలిన ఫోన్ నుంచి మంటలు రావటంతో యులియాన్టో ముఖానికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన సెప్టెంబర్ 30న చోటుచేసుకుంది. ఇదంతా యులియాన్టో వేచిచూస్తున్న హోటల్ లాబీ సీసీటీవీలో రికార్డైంది.

2013లో ఈ ఫోన్ లాంచ్
కాగా శాంసంగ్ ఈ ఫోన్‌ను 2013లో లాంచ్ చేసింది. ఫోన్ లో ఒకేసారి వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ ఆన్ చేసి వినియోగించటం వల్లే ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఇండోనేషియా పోలీసులు, టెలికాం నిపుణులు విచారణ చేపట్టారు.

గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలుళ్ల ఘటనలతో..
వినియోగదారుల భద్రతను ముఖ్యమైన అంశంగా తీసుకున్న కంపెనీ, అవసరమైన మద్దతంతా కల్పిస్తామని చెప్పింది. గతేడాది గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలుళ్ల ఘటనలతో శాంసంగ్ తీవ్ర ఇరకాటంలో పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలు స్మార్ట్‌ఫోన్ల రారాజును తీవ్రంగా దెబ్బకొట్టాయి.


Click it and Unblock the Notifications








