గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గింపు

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎస్‌-సిరీస్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌ గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ను విడుదల చేసిన అనంతరం, గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్‌8 64జీబీ మోడల్‌ రూ.49,990కు, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ 64జీబీ మోడల్‌ రూ.53,990కు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్‌8ప్లస్‌ 128జీబీ మోడల్‌ ధరను రూ.64,900​కు తగ్గించింది. అంటే అంతకముందు ధరలతో పోలిస్తే గెలాక్సీ ఎస్‌8పై 8వేల రూపాయల డిస్కౌంట్‌ను, గెలాక్సీ ఎస్‌8ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై 11వేల రూపాయల డిస్కౌంట్‌ను శాంసంగ్‌ ప్రకటించింది. ఈ తగ్గించిన ధరలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్లోనూ, శాంసంగ్‌ అధికారిక రిటైల్‌ ఛానల్స్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారు రూ.10వేల పేటీఎం క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చు.

 
గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గింపు
గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్పెసిఫికేషన్స్...
గెలాక్సీ ఎస్8, 5.8 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది (రిసల్యూషన్ కెపాసిటీ 1440x 2960పిక్సల్స్). ఇదే సమయంలో గెలాక్సీ ఎస్8+ 6.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది (రిసల్యూషన్ కెపాసిటీ 1440x 2960పిక్సల్స్). భారత్‌లో అందుబాటులో ఉండే గెలాక్సీ ఎస్8 వేరియంట్స్ సామ్‌సంగ్ Exynos 8895 SoC పై రన్ అవుతాయి.
Best Mobiles in India

English summary
Samsung Galaxy S8 prices slashed in India after Galaxy S9 launch: Here are details More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X