6జీబి ర్యామ్ , 256జీబి స్టోరేజ్‌తో సామ్‌సంగ్ ఫోన్?

గెలాక్సీ నోట్ 7 నిరాశపరచటంతో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సామ్‌సంగ్ తన అప్‌కమింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో నష్టాలన పూడ్చుకోవాలని చూస్తోంది.

6జీబి ర్యామ్ , 256జీబి స్టోరేజ్‌తో సామ్‌సంగ్ ఫోన్?

Read More : కూల్‌ప్యాడ్ కొత్త ఫోన్‌లు, 5జీబి ర్యామ్‌తోనా..?

బ్యాటరీ లోపం కారణంగా గెలాక్సీ నోట్ 7 ఫోన్‌లు పూర్తి ఫెయిల్ అవటంతో వినియోగదారుల విశ్వసనీయతను కోల్పొవటంతో పాటు వేల కోట్ల నష్టాన్ని సామ్‌సంగ్ చవిచూసింది. ఈ నేపథ్యంలో తన అప్‌కమింగ్ గెలాక్సీ ఎస్8 ద్వారా తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2017 ఫిబ్రవరిలో లాంచ్..?

2017 ఫిబ్రవరిలో లాంచ్ కాబోతున్న గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ఎడ్జ్ ఫోన్‌లకు సంబంధించి ఆసక్తికర రూమర్స్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

లేటెస్ట్ రూమర్స్ ప్రకారం..

గెలాక్సీ ఎస్8 ఫోన్ 6జీబి ర్యామ్‌తో రాబోతుందట. ఇదే సమయంలో ఫోన్ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 256జీబిగా ఉంటుందట. ఫోన్ స్టోరేజ్‌ను ఎక్స్‌ప్యాండ్ చేసేకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫోన్‌లో ఏర్పాటు చేస్తారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.

శక్తివంతమైన ప్రాసెసర్...

శక్తివంతమైన ఎక్సినోస్ అలానే సరికొత్త స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్ పై గెలాక్సీ ఎస్8 ఫోన్ రన్ అయ్యే అవకాశముందని తెులస్తోంది.

అనధికారికంగా తెలియవచ్చిన వివరాల ప్రకారం..

గెలాక్సీ ఎస్ 8 ఫోన్ 5.5 అంగుళాల 4కే అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. ఈ డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్థ్యం 3840 x 2160పిక్సల్స్. 6.2 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లో కూడా గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌ను అందుబాటులో ఉంచే అవకాశముందని సమాచారం.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌

ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో రాబోతున్న గెలాక్సీ ఎస్ 8 ఫోన్ పూర్తిగా అంచుల్లేని డిస్‌ప్లేతో కనువిందు చేసే అవకాశముందని సమాచారం.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌లో , 16 మెగా పిక్సల్ కాంభినేషన్‌తో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేసే అవకాశముందట. ఫోన్ ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరాను నిక్షిప్తం చేసే అవకాశం.

క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌..

సామ్‌సంగ్ అప్‌కమింగ్ గెలాక్సీ ఎస్8 ఫోన్ శక్తివంతమైన 4,200mAh బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుందట.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S8 rumored to feature 6GB RAM, 256GB of storage. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot