గెలాక్సీ ఎస్8లోని 8 ఆసక్తికర ఫీచర్లు

భారీ అంచనాల మధ్య సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్8, ఎస్8 స్మార్ట్‌ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో అనౌన్స్ చేసింది. విప్లవాత్మక ఫీచర్లకు తోడు సరికొత్త డిజైనింగ్‌తో ప్రపంచానికి పరిచయమైన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు పోటీ బ్రాండ్‌ల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలోని 8 ఆసక్తికర ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 వచ్చేసింది, ఇవే ఫీచర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-లైన్ ప్రాసెసర్‌లతో

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్కమ్ టాప్-లైన్ ప్రాసెసర్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ప్రపంచపు మొట్టమొటది 10nm ప్రాసెసర్లు కూడా ఇవే కావటం విశేషం.

 

ఆక్టా కోర్ 64 బిట్

గెలాక్సీ ఎస్8 ఫోన్‌ ఆక్టాకోర్ (2.3GHz క్వాడ్ + 1.7GHz క్వాడ్), 64 బిట్, 10ఎన్ఎమ్ ప్రాసెసర్‌తో వస్తుండగా, ఎస్8ప్లస్ మోడల్ ఆక్టా కోర్ (2.3GHz క్వాడ్ + 1.9GHz క్వాడ్), 64 బిట్, 10ఎన్ఎమ్ ప్రాసెసర్‌తో వస్తోంది. అయితే, ఇండియాలో లాంచ్ కాబోయే గెలాక్సీ ఎస్8 ఫోన్‌లు ఏ చిప్‌సెట్ పై రన్ అవుతాయన్నది తెలియల్సి ఉంది.

సామ్‌సంగ్ Bixby

యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్, మైక్రోసాఫ్ట్ కార్టోనాలకు పోటీగా సామ్‌సంగ్ Bixby పేరుతో విప్లవాత్మక వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను గెలాక్సీ ఎస్8 ద్వారా రంగంలోకి దింపింది.

gigabit LTE

gigabit LTE స్పీడ్‌లను అందుకునే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఎస్8 చరిత్ర సృష్టించింది.

రీఫ్రెష్ చేయబడిన డిజైనింగ్‌తో...

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు రీఫ్రెష్ చేయబడిన డిజైనింగ్‌తో కొత్త లుక్‌ను కలిగి ఉన్నాయి. ప్రీమియమ్ ఫినిషింగ్, కర్వుడ్ సైడ్స్, ఫ్రేమ్, bezel-less డిస్‌ప్లే, ప్రెజర్ సెన్సిటివ్ హోమ్ బటన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

bezel-less డిస్‌ప్లే..

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఎడ్జ్-టు-ఎడ్జ్ కర్వుడ్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసిన bezel-less, డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లే 80% ఫోన్ ఫ్రంట్ స్ర్కీన్‌ను కవర్ చేసేస్తుంది. గెలాక్సీ ఎస్7 డిస్‌ప్లేతో పోలిస్తే గెలాక్సీ ఎస్8 డిస్‌ప్లే 18% పెద్దగా ఉంటుంది.

ఆప్షనల్ డాకింగ్ స్టేషన్

గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు సరికొత్త UXను సామ్‌సంగ్ పరిచయం చేసింది. అంతేకాకుండా, గెలాక్సీ ఎస్8 ఫోన్‌లను డెస్క్‌టాప్ కంప్యూటర్‌లా మార్చేసుకునే విధంగా ఆప్షనల్ డాకింగ్ స్టేషన్ సదుపాయాన్ని కూడా సామ్‌సంగ్ కల్పించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung Galaxy S8 and S8+ launched,Here are the 8 biggest features. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting