మార్కెట్లోకి గెలాక్సీ ఎస్8, ఎస్8+

న్యూఢిల్లో ఏర్పాటు చేసిన స్పషల్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌లను విడదుల చేసింది. గెలాక్సీ ఎస్8 మోడల్ ధర రూ.57,900. గెలాక్సీ ఎస్8+ మోడల్ ధర రూ.64,900. మే 5, 2017 నుంచి మర్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ మార్కెట్లో ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ అలానే సామ్‌సంగ్ ఇండియా స్టోర్‌లు విక్రియించ బోతున్నాయి. ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Read More : జియో వల్ల లాభమెంతా..? నష్టమెంత..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విప్లవాత్మక ఫీచర్లు...

బ్లుటూత్ 5 కనెక్టువిటీ స్టాండర్డ్, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్, బిక్స్‌బై డిజిటల్ అసిస్టెంట్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ ఫోన్‌లలో చూడొచ్చు.ఇండియాలో విడుదల కాబోయే ఎస్8, ఎస్8+ ఫోన్‌లు Snapdragon 835 చిప్‌సెట్‌లకు బదులు Exynos 8895 చిప్‌సెట్‌లతో వస్తున్నాయి.

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్

గెలాక్సీ ఎస్8, ఎస్8+ మోడల్స్ హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ ఫోన్‌లో రెండు సిమ్ స్లాట్‌లతో పాటు మైక్రోఎస్డీ స్లాట్ కూడా ఉంటుంది. దీంతో యూజర్ మరింత కంఫర్ట్‌గా ఫీలవుతారు.

బ్లటూత్ 5 సపోర్ట్‌తో వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ ఎస్8, ఎస్8+ మోడల్స్ బ్లటూత్ 5 సపోర్ట్‌తో వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లు కావటం విశేషం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు కీలకమని భావిస్తోన్న బ్లుటూత్ 5 ద్వారా హైక్వాలిటీ కనెక్టువిటీని ఆస్వాదించవచ్చు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి, గెలాక్సీ ఎస్8 మోడల్ 5.8 అంగుళాల స్ర్కీన్, ఎస్8+ మోడల్ 6.2 అంగుళాల స్ర్కీన్‌లను కలిగి ఉంటాయి. QHD 2960 x 1440 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్స్‌ను కలిగి ఉండే ఈ ఫోన్ డిస్‌ప్లేలు హైక్వాలిటీ పనితీరును కనబరుస్తాయి.

ఫేషియల్ రికగ్నిషన్

గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్‌ఫోన్‌లు ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఫోన్ లకు అదనపు సెక్యూరిటీని ఆఫర్ చేస్తుంది.

ఇతర స్పెసిఫికేషన్స్..

Exynos 8895 SoC, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ 80 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్,

ఐపీ68 రేటింగ్

ఐపీ68 రేటింగ్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు దమ్ము ఇంకా నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలవు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి గెలాక్సీ ఎస్8 మోడల్ 3000mAh బ్యాటరీతో ప్యాక్ అయి ఉంటుంది. ఎస్8 ప్లస్ మోడల్ 3500mAh బ్యాటరీతో ప్యాక్ అయి ఉంటుంది. ఈ రెండు బ్యాటరీలు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

కనెక్టువిటీ ఫీచర్లు..

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోన్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌‌లలో 4G వోల్ట్, NFC, MST, Bluetooth 5.0 LE, ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung Galaxy S8, S8+ launched in India at Rs. 57,900, Rs. 64,900. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting