ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

నెలలోపే కోటి మంది కొనుగోలు చేసిన ఫోన్..

|

ఈ ఏడాదికిగాను బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను కన్స్యూమర్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8+ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో గెలాక్సీ ఎస్8 నిలిచింది. ఈ రెండు ఫోన్‌లను రిలీజ్ అయిన నెలలోపే కోటి మంది కొనుగోలు చేసినట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. 2016 సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు అంతగా అచ్చిరాలేదని చెప్పాలి. బ్యాటరీ లోపం కారణంగా గెలాక్సీ నోట్ 7 యూనిట్లు పూర్తిగా ఫెయిల్ అవటంతో సామ్‌సంగ్‌కు వేల కోట్లలో నష్టం వాటల్లింది.

 

అనూహ్యంగా పుంజుకున్న సామ్‌సంగ్..

అనూహ్యంగా పుంజుకున్న సామ్‌సంగ్..

2017లో అనూహ్యంగా పంజుకున్న సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ మోడల్స్‌తో తిరిగి నెం.1 స్థానాన్ని తిరిగి  కైవసం చేసుకోగలిగింది. కన్స్యూమర్ రిపోర్ట్ జాబితాలో యాపిల్ బ్రాండ్ 5వ స్థానికి పడిపోవటం విశేషం.

బెస్ట్ ఫోన్ అంటూ కితాబు..

బెస్ట్ ఫోన్ అంటూ కితాబు..

స్టన్నింగ్ కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్, అందమైన డిస్‌ప్లే ఇంకా వాటర్ రెసిస్టెంట్ ప్యాకేజీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కోరుకుంటున్నట్లయితే గెలాక్సీ ఎస్8+ మీకు బెస్ట్ ఛాయిస్ అంటూ కన్స్యూమర్ రిపోర్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కన్స్యూమర్ రిపోర్ట్ విడుదల చేసిన జాబితాలో గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ మూడవ స్థానంలో నిలవగా, ఎల్ జీ జీ6 నాలుగవ స్థానంలో
నిలిచింది. యాపిల్ ఐఫోన్ 7 ఐదవ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.

మే 5 నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
 

మే 5 నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్‌ఫోన్‌లు మే 5, 2017 నుంచి లభ్యమవుతున్నాయి. గెలాక్సీ ఎస్8 మోడల్ ధర రూ.57,900. గెలాక్సీ ఎస్8+ మోడల్ ధర రూ.64,900. మార్కెట్లో ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ అలానే సామ్‌సంగ్ ఇండియా స్టోర్‌లు విక్రయిస్తున్నాయి.

 విప్లవాత్మక ఫీచర్లు...

విప్లవాత్మక ఫీచర్లు...

బ్లుటూత్ 5 కనెక్టువిటీ స్టాండర్డ్, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్, బిక్స్‌బై డిజిటల్ అసిస్టెంట్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ఈ ఫోన్‌లలో ఉన్నాయి. ఇండియాలో లాంచ్ అయిన ఎస్8, ఎస్8+ ఫోన్‌లు Exynos 8895 చిప్‌సెట్‌లతో రన్ అవుతున్నాయి.

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్

 గెలాక్సీ ఎస్8, ఎస్8+ మోడల్స్ హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ ఫోన్‌లో రెండు సిమ్ స్లాట్‌లతో పాటు మైక్రోఎస్డీ స్లాట్ కూడా ఉంటుంది. దీంతో యూజర్ మరింత కంఫర్ట్‌గా ఫీలవుతారు.

బ్లటూత్ 5 సపోర్ట్‌తో వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లు

బ్లటూత్ 5 సపోర్ట్‌తో వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ ఎస్8, ఎస్8+ మోడల్స్ బ్లటూత్ 5 సపోర్ట్‌తో వస్తోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌లు కావటం విశేషం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు కీలకమని భావిస్తోన్న బ్లుటూత్ 5 ద్వారా హైక్వాలిటీ కనెక్టువిటీని ఆస్వాదించవచ్చు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి, గెలాక్సీ ఎస్8 మోడల్ 5.8 అంగుళాల స్ర్కీన్, ఎస్8+ మోడల్ 6.2 అంగుళాల స్ర్కీన్‌లను కలిగి ఉంటాయి. QHD 2960 x 1440 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్స్‌ను కలిగి ఉండే ఈ ఫోన్ డిస్‌ప్లేలు హైక్వాలిటీ పనితీరును కనబరుస్తాయి. గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్‌ఫోన్‌లు ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్‌తో వస్తున్నాయి. ఈ టెక్నాలజీ ఫోన్ లకు అదనపు సెక్యూరిటీని ఆఫర్ చేస్తుంది.

ఇతర స్పెసిఫికేషన్స్..

ఇతర స్పెసిఫికేషన్స్..

Exynos 8895 SoC, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ 80 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్,

ఐపీ68 రేటింగ్

ఐపీ68 రేటింగ్

ఐపీ68 రేటింగ్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు దమ్ము ఇంకా నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలవు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి గెలాక్సీ ఎస్8 మోడల్ 3000mAh బ్యాటరీతో ప్యాక్ అయి ఉంటుంది. ఎస్8 ప్లస్ మోడల్ 3500mAh బ్యాటరీతో ప్యాక్ అయి ఉంటుంది. ఈ రెండు బ్యాటరీలు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు..

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తోన్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌‌లలో 4G వోల్ట్, NFC, MST, Bluetooth 5.0 LE, ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S8 and S8+ plus ranked as best smartphones of the year. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X