శాంసంగ్ సైలెంట్‌గా 128 జిబి వేరియంట్లను దించేసింది

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లను గత నెల కిందట విడుదల చేసిన విషయం విదితమే.

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్‌లను గత నెల కిందట విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లు తొలుత 64/256 జీబీ వేరియెంట్లలోనే విడుదలయ్యాయి. ఇక వీటి ప్రారంభ ధరలు రూ.57,900, రూ.64,900గా ఉన్నాయి. అయితే ఇవే ఫోన్లకు చెందిన 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు ప్రస్తుతం విడుదలయ్యాయి.అయితే కంపెనీ ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా వీటిని సైలెంట్ గా ఇండియాలో దించేసింది. కాగా ఈ ఫోన్లను బార్సిలోనియాలో జరిగిన Mobile World Congress 2018లో అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. శాంసంగ్ ఫోన్లు ఐఫఓన్ 8, ప్లస్ లకు గట్టిపోటిలకు గట్టి పోటీనిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఆపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్ స్టార్టింగ్ ధర 67,940గా ఉంది.

 

భారీ పుల్ వ్యూ డిస్‌ప్లే‌తో Moto G6, లీకయిన ధర, ఫీచర్లుభారీ పుల్ వ్యూ డిస్‌ప్లే‌తో Moto G6, లీకయిన ధర, ఫీచర్లు

ధర

ధర

గెలాక్సీ ఎస్9కు చెందిన 128 జీబీ వేరియెంట్ రూ.61,900 ధరకు లభిస్తుండగా, గెలాక్సీ ఎస్9 ప్లస్ 128 జీబీ వేరియెంట్ రూ.68,900 ధరకు లభిస్తున్నది. వీటిని దేశ వ్యాప్తంగా ఉన్న రీటెయిల్ స్టోర్స్‌తోపాటు శాంసంగ్ ఆన్‌లైన్ షాప్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి..

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి..

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఈ ఫోన్లను కొనుగోలు చేసే కస్టమర్లకు శాంసంగ్ రూ.6వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. మరో రూ.33వేల వరకు స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా లభిస్తున్నది.

డబుల్ డేటా
 

డబుల్ డేటా

ఈ ఫోన్లను కొనే కస్టమర్లకు ఎయిర్‌టెల్ రూ.499, రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై డబుల్ డేటాను అందిస్తున్నది. దీంతోపాటు 1 ఏడాది పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తాయి.

జియోలో

జియోలో

జియోలో అయితే రూ.4999 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే ఏడాది వాలిడిటీ ఉన్న 1 టీబీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది.

ఫీచర్లు

ఫీచర్లు

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు :

5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,


గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు :

6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

 

Best Mobiles in India

English summary
Samsung Galaxy S9, Galaxy S9 plus 128GB Variant Silently Launched in India more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X