పర్పిల్ కలర్ వేరియంట్‌లో గెలాక్సీ ఎస్9

Posted By: BOMMU SIVANJANEYULU

సామ్‌సంగ్ నుంచి లాంచ్ అయ్యే ప్రతి ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ రెండు లేదు మూడు కలర్
వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

పర్పిల్ కలర్ వేరియంట్‌లో గెలాక్సీ ఎస్9

ఈ కలర్ వేరియంట్స్ అనేవి పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండటంతో నచ్చిన కలర్ వేరియంట్‌ను సామ్‌సంగ్ యూజర్లు సొంతం చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకున్న సాంగ్‌సంగ్ గెలాక్సీ ఎస్9 లాంచ్ విషయంలో కొత్త మార్పులతో ముందుకు వస్తున్నట్లు తెలస్తోంది.

సామ్‌మొబైల్ రివీల్ చేసిన వివరాల ప్రకారం వచ్చే ఏడాది లాంచ్ కాబోతోన్న గెలాక్సీ ఎస్9 మొత్తం నాలుగు కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుందట.

బ్లాక్, గోల్డ్, బ్లు ఇంకా పర్పిల్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుందని సమాచరం. ఇప్పటి వరకు ఇటువంటి కలర్ వేరియంట్‌ను సామ్‌సంగ్ విడుదల చేయలేదు. వచ్చే ఏడాది నిర్వహంచే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లేదా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

గెలాక్సీ ఎస్ 9 (రూమర్ స్పెక్స్)..

ఈ ఫోన్ ఎక్సినోస్ 9810 ప్రాసెసర్ లేదా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్ ఇంకా 6జీబి ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ లెన్స్ కెమెరా సపోర్ట్.

మానిటర్ కొనుగోలు చేస్తున్నారా, మీ కోసం 5 విషయాలు !

Read more about:
English summary
Samsung could be bringing the purple color option for the Galaxy S9 next year, in addition to black, gold, and blue.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot