భారీ ఆఫర్లతో గెలాక్సీ S9, S9 Plus విడుదల, ధర, ఫీచర్లు, ఇతర వివరాలు మీ కోసం

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మళ్లీ ఇండియా మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. తాజాగా కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు Galaxy S9, Galaxy S9 Plusలను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది.

|

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మళ్లీ ఇండియా మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అయింది. తాజాగా కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు Galaxy S9, Galaxy S9 Plusలను ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా వీటి ప్రారంభ ధర రూ.57,900. కాగా కంపెనీ తొలిసారిగా ఈ ప్రీమియం ప్రొడక్టులను ఇటీవల స్పెయిల్‌లోని బార్సిలోనాలో ఆవిష్కరించింది. డ్యూయెల్‌ ఎపర్చర్‌ అండ్‌ స్లో మోషన్‌ వీడియో ఆప్షన్స్, డ్యూయెల్‌ స్టీరియో స్పీకర్స్, డాల్బే సౌండ్‌ వంటి ఫీచర్లున్న ఈ స్మార్ట్‌ఫోన్లు యాపిల్‌ ఐఫోన్‌-ఎక్స్, గూగుల్‌ పిక్సెల్‌-2 ఫోన్లకు గట్టిపోటీనిస్తాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్లు మార్చి 16 నుంచి కస్టమర్లను అందుబాటులోకి రానున్నవి. ఎస్‌9 స్మార్ట్‌ఫోన్‌లో 5.8 అంగుళాల డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఎస్‌9 ప్లస్‌లో 6.2 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 12 ఎంపీ రియర్‌/ ఫ్రంట్‌ కెమెరాలు, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. మొత్తం ఫీచర్లపై ఓ లుక్కేయండి.

 

సోషల్ మీడియాలో ఏవి పోస్ట్ చేయకూడదు!సోషల్ మీడియాలో ఏవి పోస్ట్ చేయకూడదు!

ఫీచర్లు

ఫీచర్లు

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు : 5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,
గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు : 6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

64/256 జీబీ వేరియెంట్లను మాత్రమే..

64/256 జీబీ వేరియెంట్లను మాత్రమే..

రెండు ఫోన్లు మిడ్‌నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లైలాక్ పర్పుల్ రంగుల్లో విడుదల కాగా ఈ ఫోన్లకు చెందిన 64/256 జీబీ వేరియెంట్లను మాత్రమే భారత్‌లో విక్రయించనున్నారు. 128 జీబీ వేరియెంట్ కూడా విడుదలైనప్పటికీ ప్రస్తుతం ఈ వేరియెంట్‌ను మాత్రం విక్రయించడం లేదు. ఇక ఈ రెండు ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 (64 జీబీ) - రూ.57,900
శాంసంగ్ గెలాక్సీ ఎస్9 (256 జీబీ) - రూ.65,900
శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ (64 జీబీ) - రూ.64,900
శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ప్లస్ (256 జీబీ) - రూ.72,900

 

రూ.2వేలతో ప్రీ బుకింగ్
 

రూ.2వేలతో ప్రీ బుకింగ్

శాంసంగ్ ఆన్‌లైన్ షాప్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ.2వేలను చెల్లించి వీటిని ప్రీ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇక మార్చి 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. ఇక గెలాక్సీ ఎస్9 ప్లస్‌కు చెందిన 256 జీబీ వేరియెంట్‌ను ప్రత్యేకంగా రిలయన్స్ డిజిటల్, శాంసంగ్ స్టోర్స్‌లో ఆఫ్‌లైన్‌లో విక్రయించనున్నారు.

పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే ..

పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే ..

పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే రూ.6వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, కన్‌జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ద్వారా కొనుగోలు చేసినా రూ.6వేల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే పాత స్మార్ట్‌ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.22,500 వరకు డిస్కౌంట్‌ను ఇస్తారు. మరో రూ.6వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను ఇవ్వనున్నారు.

ఎయిర్‌టెల్ ఆఫర్లు

ఎయిర్‌టెల్ ఆఫర్లు

శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అలాగే రూ.9900 డౌన్ పేమెంట్ చెల్లిస్తే గెలాక్సీ ఎస్9 ఫోన్‌ను ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందిస్తుంది. వారు నెలకు తమకు లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్, ఈఎంఐతో కలిపి రూ.2499లను 24 నెలల పాటు చెల్లించాలి. ఈ కాలంలో వారికి 2టీబీ మొబైల్ డేటా లభిస్తుంది.

రూ.499, రూ.799 ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే..

రూ.499, రూ.799 ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే..

శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ ఫోన్లలో ఎయిర్‌టెల్‌కు చెందిన రూ.499, రూ.799 ఇన్ఫినిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే వారికి డబుల్ మొబైల్ డేటా లభిస్తుంది. ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ ఉచిత మెంబర్‌షిప్, హ్యాండ్ సెట్ ప్రొటెక్షన్ లభిస్తాయి.

జియో

జియో

జియోలో అయితే రూ.4999 ప్లాన్ ద్వారా 1టీబీ డేటా వస్తుంది. వొడాఫోన్‌లో అయితే రూ.999 ఆ పైన విలువ గల రెడ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడితే ఏడాది పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

వొడాఫోన్

వొడాఫోన్

వొడాఫోన్ ప్రీపెయిడ్‌లో రూ.199 ప్లాన్ రీచార్జి చేసుకుంటే రోజుకు 1.4 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ నెల రోజుల పాటు వస్తాయి. అలాగే ప్రతినెలా మరో 10 జీబీ డేటాను 10 నెలల పాటు అదనంగా ఇస్తారు.

Best Mobiles in India

English summary
Samsung Galaxy S9, Galaxy S9 Plus Launched at a Starting Price of Rs 57,900: All You Need to Know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X