శాంసంగ్ గెలాక్సీ S9 ఫీచర్లు లీక్, 6జిబి ర్యామ్‌తో..

Written By:

శాంసంగ్ నుంచి అతి త్వరలో రెండు కొత్త ఫోన్లు దూసుకురానున్నాయి. కంపెనీ అనుకున్నదానికంటే ముందుగానే శాంసంగ్‌ ఫ్లాగషిప్‌ ఫోన్లను లాంచ్‌ చేయనుందంటూ పలు వార్తలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న ఈ డివైస్‌ ఫీచర్లు, ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. అలాగే 2018 మార్చి నెలలో కాకుండా జనవరి రెండవ వారంలోనే ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుంది.

Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !

శాంసంగ్ గెలాక్సీ  S9 ఫీచర్లు లీక్, 6జిబి ర్యామ్‌తో..

ఈ రెండింటిలోనూ 6జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కెపాసిటీ, కర్వ్‌డ్‌ఎడ్జ్‌ సూపర్‌ అమోలెడ్‌ ఇన్ఫినిటీ డిస్‌ ప్లే, స్నాప్‌ డ్రాగన్‌ 845 క్వాల్కం ప్రాసెసర్‌, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా సెటప్‌ ప్రధాన ఫీచర్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు, ముందు వచ్చిన మోడల్స్ తరహాలోనే బిగ్సిబీ బటన్‌ , ఫింగర్‌ పింట్‌ సెన్సర్‌ లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్ ఎస్ఈ 2పై గురిపెట్టిన ఆపిల్, అంతా సీక్రెట్ !

శాంసంగ్ గెలాక్సీ  S9 ఫీచర్లు లీక్, 6జిబి ర్యామ్‌తో..

మరోవైపు గెలాక్సీ ఎస్‌ 9లో 5.8అంగుళాల స్క్రీన్‌ను, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌లో 6.2-అంగుళాల స్క్రీన్‌ ను జత చేసినట్టు తెలుస్తోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే 16 ఎంపీ రియర్‌ కెమెరా, 12 ఎంపీ డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాలను పొందుపర్చినట్టు అంచనా. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చిలో కాకుండా జనవరిలోనే లాంచ్‌ చేసి.. మార్చినాటికి విక్రయాలను ప్రారంభించేందుకు యోచిస్తోంది.

English summary
Samsung Galaxy S9 Leaked in Images, Dual Rear Cameras Tipped Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot