శక్తివంతమైన డిస్‌ప్లేతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4..?

Posted By: Prashanth

శక్తివంతమైన డిస్‌ప్లేతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4..?

 

సామ్‌సంగ్ కొత్త జనరేషన్ ఫోన్ ‘గెలాక్సీ ఎస్4’ పై భారీ అంచనాలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన మరో రూమర్లు అభిమానాల ఆశలను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ ఆధునిక వర్షన్ ఫోన్‌ను ఏప్రిల్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు సామ్‌సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా నివేదికులు పేర్కొంటున్నాయి. ఈ ఫ్లాగ్ షిప్ డివైజ్‌లో ఏర్పాటు చేసిన శక్తివంతమైన డిస్‌ప్లేను పాలిమర్ వ్యవస్థ ఆధారంగా రూపొందించినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏదేమైనప్పటికి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే సామ్‌సంగ్ వర్గాలు గెలాక్సీ ఎస్4 పై పెదవి విప్పాల్సిందే.

పలు నివేదికలు ఆధారంగా సేకరించిన గెలాక్సీ ఎస్4 ఫీచర్లు (ఊహాజనితంగా):

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot