సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లలో తెలుగు కంటెంట్

Posted By:

సామ్‌సంగ్ అభిమానులకు శుభవార్త. ఇక పై గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ట్యాబ్లెట్ పీసీలు తెలుగుతో సహా 8 ప్రాంతీయ భాషలకు సంబంధించిన యూజర్ ఇంటర్ ఫేస్‌లలో లభించనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ ఇంకా గుజరాతీ భాషల్లో యూజర్ ఇంటర్‌ఫేస్‌లతో పాటు కంటెంట్‌ను అందిస్తామని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేర్కొంది.

సామ్‌సంగ్ ఫోన్‌లలో తెలుగు

గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ ఎస్4, గెలాక్సీ ట్యాబ్ 3 మోడళ్లలో ఈ సదుపాయం మంగళవారం నుంచి అమలవుతుందని సామ్‌సంగ్ ఇండియా కంట్రీహెడ్ వినీజ్ తనేజా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే ప్రత్యేకమైన యాజర్ ఇంటర్‌ఫేస్‌ను త్వరలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు విస్తరింపజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేకమైన సౌలభ్యత ద్వారా సామ్‌సంగ్ గెలాక్సీ యూజర్లు తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లో ఎంటర్‌టైన్‌మెంట్, గేమ్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ తదితర అంశాలకు సంబంధించిన అప్లికేషన్‌లను పొందవచ్చు. ఫేస్‌బుక్ ఇంకా ఫేస్‌బుక్ మెసెంజర్ అప్లికేషన్‌లనుసైతం ఈ 9 ప్రాంతీయ భాషలు సపోర్ట్ చేస్తాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot