ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ అడ్వాన్స్
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమదైన రీతిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న మోటరోలా, మైక్రోమాక్స్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు చెక్ పెట్టే లక్ష్యంతో సామ్‌సంగ్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌తో ముందుకు రాబోతున్నట్లు ముంబైకు చెందిన ప్రముఖ రిటైలర్ మహేష్ టెలికామ్ వెల్లడించింది.గెలాక్సీ స్టార్ అడ్వాన్స్ (SM- G350E) మోడల్‌లో విడుదల కాబోతున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.7,299గా సదరు రిటైలర్ పేర్కొంది. అయితే, ఈ ఆవిష్కరణకు సంబంధించి సామ్‌సంగ్ ఇప్పటి వరకు ఏ విధమైన ప్రకటనను వెలువరించలేదు. గెలాక్సీ స్టార్ అడ్వాన్స్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మహేష్ టెలికామ్ వెల్లడించిన ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

4.3 అంగుళాల WVGA టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
సామ్‌సంగ్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
డ్యూయల్ సిమ్ సపోర్ట్,
512ఎంబి ర్యామ్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో),
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ సపోర్ట్,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
చాట్‌ఆన్, వీడియో రికార్డింగ్, గూగుల్ టాక్, గూగుల్ మ్యాప్స్, ఎఫ్ఎమ్ రేడియో రికార్డర్ ఇంకా సామ్‌సంగ్ అప్లికేషన్‌లను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసినట్లు సదరు రిటైలర్ తెలిపింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








