సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో vs మైక్రోమ్యాక్స్ బోల్ట్ (మీ ఛాయిస్ ఏది..?)

|

ఇండియా వంటి ప్రదాన మార్కెట్‌లలో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అత్యత్తమ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయటమంటే ఓ పరీక్షే!. ఇందుకు కారణం, వందలాది స్మార్ట్‌ఫోన్ మోడళ్లు మార్కెట్లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోవాలా అర్థంకాక వినియోగదారుడు సతమతమవుతున్నాడు. ఇవాళ విడుదలైన కొత్త వర్షన్ రేపటికి పాతదైపోతోంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్ కంపెనీలు రెండు మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. సామ్‌సంగ్ నుంచి విడుదలైన గెలాక్సీ స్టార్ ప్రో, మైక్రోమ్యాక్స్ నుంచి విడుదలైన మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ40 స్మార్ట్‌ఫోన్‌ల మధ్య మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో vs మైక్రోమ్యాక్స్ బోల్ట్ (మీ ఛాయిస్ ఏది..?)

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇండియన్ రిటైల్ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో ధర రూ.6989.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మైక్రోమ్యాక్స్ బోల్ట్ కీలక స్సెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్480× 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, స్ప్రెడ్ ట్రమ్ ఎస్ సీ6820 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1గిగాహెట్జ్), 512ఎంబి ర్యామ్, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4.5గంటల టాక్ టైమ్, 175 గంటల స్టాండ్‌‍బై టైమ్). ఇండియన్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ40 స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,299.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఎంపికలో భాగంగా ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో మీకు నచ్చిన హ్యాండ్‌సెట్‌ను ఎంపిక చేసుకోండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X