సామ్‌సంగ్ ట్రిపుల్ సిమ్ ఫోన్ ‘గెలాక్సీ స్టార్ ట్రయోస్’
ఏక కాలంలో మూడు సిమ్‌లను సపోర్ట్ చేసే విధంగా ‘గెలాక్సీ స్టార్ ట్రయోస్' పేరుతో సరికొత్త ట్రిపుల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ కంపెనీ బ్రెజిల్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ తక్కువ ధర హ్యాండ్‌సెట్‌ను బ్రెజిల్‌కు చెందిన సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ తన లిస్టింగ్స్‌లో పేర్కొంది. ధర ఇంకా ఇతర అందుబాటు వివరాలను వెల్లడించలేదు. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే......

ఫోన్ పిరిమాణం 61 x 106 x 11మిల్లీమీటర్లు,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.1 అంగుళాల క్వాగా టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 240 x 320పిక్సల్స్),
సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ ఎస్1 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ బరువు 105 గ్రాములు.
ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ట్రిపుల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికి గెలాక్సీ స్టార్ ట్రయోస్ ఉత్తమ ఎంపిక కావచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications